భారత్‌ –  చైనా సైనికుల ఘర్షణల నేపథ్యంలో చైనా సైన్యం భారత్‌ భయానికి తోకముడిచింది. రెండు కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లిపోయింది. లడఖ్‌ లోని గాల్వన్‌ లోయ నుంచి నిజంగానే చైనా సైన్యం వెనక్కివెళ్లిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే జిత్తులమారి డ్రాగన్‌ చెబుతున్నది ఒకటి.. చేసేది ఒకటి ఉంటుంది. కాని తాజాగా శాటిలైట్‌ చిత్రాలు విడుదలయ్యాయి. వాటి ద్వారా చైనా సైన్యం అక్కడి నుంచి వెళ్లిపోయింది. అక్కడున్న టెంట్లు, శిబిరాలను తొలగించించింది. రెండు నెలలుగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన గాల్వన్‌ లోయలో ఇండియా , చైనా సైనికులు వెనక్కి వెళ్లిపోయినట్లు స్పష్టంగా అర్థమైపోతోంది.

Galwan River

జూన్‌ 30న రెండు దేశాల మధ్య కమాండర్ల స్థాయిలో చర్చలు జరిగాయి. రెండువైపులా దాదాపు రెండు కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. అందులో భాగంగా సోమవారం నుంచి వెనుకంజ వేస్తున్న డ్రాగన్‌ సైన్యం.. మంగళవారం కూడా ఛలో.. ఛలో.. అంటూ తోకముడిచింది. అయితే చిత్తులమారి డ్రాగన్‌ మళ్లీ ఎటాక్‌ చేస్తే డ్రాగన్‌ తోక కట్‌ చేసేవిధంగా ఏర్పాటు చేసుకుంటోంది భారత సైన్యం.

గాల్వన్‌ లోయ నుంచి చైనా తన సైన్యాన్ని రెండు కిలోమీటర్లు వరకు వెనక్కి రప్పించుకుంది. అక్కడి పెట్రోలింగ్‌ పాయింట్ -14 వద్ద తన గుడారాలను సైతం తొలగించేసింది.

రెండుదేశాల సైన్యం మధ్య ఘర్షణ జరిగిన హాట్‌ స్ప్రింగ్స్‌, గోగ్రా ప్రాంతాల నుంచి బీజింగ్‌ సైన్యం 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్లింది. ఇక ఇండియా సైన్యం కూడా వెనక్కి వెళ్లిపోవడంతో ఇప్పుడు ఆ గాల్వన్‌ లోయ ప్రాంతంలో సైనికులు లేకుండా పోయింది.

కాగా, ప్యాంగాంగ్‌ సరస్సు దగ్గర మాత్రం చైనా తన సైన్యాన్ని అలాగే ఉంచేసింది. పైగా ఇక్కడ 190 నిర్మాణాలు ఏర్పాటు చేసింది. త్వరలో రెండు దేశాల మధ్య మళ్లీ చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Galwan River

చైనా యాప్స్ బ్యాన్‌తో మరింత దెబ్బ..

ఇక చైనా యాప్స్‌ బ్యాన్‌తో చైనా కంపెనీలు వేల కోట్లు నష్టపోవడంతో చైనా ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీనికి తోడు మొన్న ప్రధాని నరేంద్రమోదీ లడఖ్‌ పర్యటన సందర్భంగా గాయపడ్డ సైనికునలు సైతం పరామర్శించారు. దీంతో చైనాకు షాకిచ్చినట్లయింది. భారత్‌తో పెట్టుకుంటే ఆర్థికంగా, అన్ని రకాలుగా ప్రమాదమేనని భావించిన సైనా.. 48 గంటల్లో రకరకాలుగా భారత్‌తో సంప్రదింపులు, చర్చలు జరిపారు. చివరకు తోకముడిచి వెనక్కి వెళ్లిపోయారు.

హైవే ప్రాజెక్టుల్లో అనుమతిపై చైనాకు దెబ్బ..

అంతేకాదు హైవే ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలకు అనుమతి నిరాకరిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు, వివిధ రంగాల్లో చైనా పెట్టుబడిదారులను ప్రభుత్వం ప్రోత్సహించదని స్పష్టం చేశారు. త్వరలోనే హైవే ప్రాజెక్టుల్లో పాల్గొనే చైనా సంస్థలపై నిషేధం విధించేలా ఓ విధానాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. ఆ విధానంలో హైవే ప్రాజెక్టులో పాల్గొనేలా భారత్‌ కంపెనీల అర్హత ప్రమాణాలు పెంపొందించేలా సడలింపు చేపడతామన్నారు. ఇలా ఒక్కొక్కటిగా చైనాకు భారత్‌ తనదైన శైలిలో దెబ్బకొట్టడంతో చైనాకు ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో పడిపోయింది.

Galwan River

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort
Best10 tipobet