అటువంటి వారికి పుట్టగతులు ఉండవు : వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి
విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్.
By Medi Samrat Published on 17 Oct 2023 7:15 PM ISTవిజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. ఆయన మాట్లాడుతూ అమ్మవారితో ఆటలు అడ్డుకోవద్దని.. అటువంటి వారికి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. ఉత్సవ ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయని, ఏదో ఒకటి మాట్లాడి బురద చల్లాలని మాట్లాడం సరికాదని వెల్లంపల్లి హితవు పలికారు. గత ప్రభుత్వ హయంలో రాత్రికి రాత్రే గోశాలను తొలగించారని, వినాయకుడి గుడి పగుల గొట్టారని.. ఇప్పుడు వాళ్ళు మాట్లాడటం శోచనియమన్నారు. గత ప్రభుత్వం కంటే ఇప్పుడు సామాన్య భక్తులకు కూడా త్వరగా దర్శనం అయ్యేలా దేవాదాయ శాఖ అధికారులు, పాలక మండలి సభ్యులు ఏర్పాట్లు చేశారని వెల్లంపల్లి ప్రశంసించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం ఘనంగా దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో మొదటి రోజున శ్రీ కనకదుర్గా అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు ఆలయాన్ని సందర్శించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. దసరా వేడుకల మొదటి రోజున దుర్గా ఆలయాన్ని సందర్శించేందుకు రికార్డు స్థాయిలో యాత్రికులు వచ్చారు.