విజయవాడ బస్టాండ్‌లో దారుణం..

Vijayawada News. విజయవాడ పండిత్ నెహ్రూ బస్టాండ్ లో దారుణం చోటుచేసుకుంది. సంవత్సరం వ‌య‌సున్న‌

By Medi Samrat
Published on : 25 Oct 2021 9:12 AM IST

విజయవాడ బస్టాండ్‌లో దారుణం..

విజయవాడ పండిత్ నెహ్రూ బస్టాండ్ లో దారుణం చోటుచేసుకుంది. సంవత్సరం వ‌య‌సున్న‌ ఓ పాపను బస్టాండ్ లో వదివెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. పాప గుక్క‌ప‌ట్టి ఎడుస్తూ నిలబడడంతో ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే బస్టాండ్ అవుట్‌పుట్ పోలీసులు స్పందించారు. ఆక‌లితో ఉన్న పాపకు పోలీసులు పాలు, బిస్కట్ లు ఇచ్చే ప్ర‌య‌త్నం చేయ‌గా.. పాప అమ్మా.. అమ్మా.. అని బోరున విలపిస్తుంది. పాపను ఎవరు తీసుకువచ్చారు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. బస్టాండ్ లోని సిసిఫుటేజ్ ను పోలీసులు పరిశీస్తున్నారు. మహిళా కానిస్టేబుల్ సహాయంతో చిన్నారిని కృష్ణలంక పోలీస్ స్టేషను కు తీసుకువెళ్లారు పోలీసులు.


Next Story