అగస్టు 19న జరిగిన వ్యాపారవేత్త రాహుల్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి హత్యతో సంబంధం ఉన్న ఏడుగురు నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేయగా.. ఆదివారం నాడు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకు హత్యకేసులో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు విజయవాడ సిటీ పోలీసు కమిషనర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
పోలీసులు ఆదివారం నాడు.. శనగల శ్రీనాధ్ అలియాస్ సీతయ్య, దోశెట్టి బాబురావు, ముళ్లపూడి రాజాబాబు అలియాస్ బాబు, కరణం రమేష్ లను అరెస్ట్ చేశారు. అంతేకాకుండా రాహుల్ హత్యకు ఉపయోగించిన ప్రదేశాలైన కోరాడ చిట్‌పండ్, కోగంటి సత్యం ఆఫీసులను పోలీసులు సీజ్ చేసినట్టు ప్రకటనలో పేర్కోన్నారు. ఇక ఈ కేసులో మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. మిగిలిన వారిని కూడా వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకుంటామని.. కేసులోని నిందితులందరిని పోలీసు కస్టడికి తీసుకుని పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని ప్రకటనలో తెలిపారు.