గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతమైన గురజాల డివిజన్ పరిధిలో నేటి నుండి మూడవ దశ నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 9 మండలాల పరిధిలో 134 పంచాయతీలకు గాను అభ్యర్థుల నుండి అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. తొమ్మిది మండలాల్లో 5 మండల కేంద్రాలు పంచాయతీలుగా ఉన్నాయి. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నామినేషన్లు సజావుగా జరిగేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు.
పల్నాడు పై ప్రత్యేక దృష్టి
గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా పల్నాడు పై ఎన్నికల అధికారి ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. ఏదీ ఏమైనప్పటికీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలో నామినేషన్ ప్రక్రియలో దాదాపు ఏడుగురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొంటారని సమాచారం.