మారు వేషంలో ఎరువుల షాపులకు వెళ్లిన‌ సబ్ కలెక్టర్..!

Sub-Collector visits fertilizer shops posing as a farmer. విజయవాడ సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ సాధారణ రైతు వేషంలో కైకలూరులోని

By Medi Samrat
Published on : 7 Aug 2021 3:39 PM IST

మారు వేషంలో ఎరువుల షాపులకు వెళ్లిన‌ సబ్ కలెక్టర్..!

విజయవాడ సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ సాధారణ రైతు వేషంలో కైకలూరులోని ఎరువుల షాపులకు వెళ్లారు. ఎరువులు కావాలని ఓ దుకాణంలోకి వెళ్లిగా.. సబ్ కలెక్టర్ కు స్టాక్ ఉన్నా లేవని చెప్పాడు యజమాని. అక్కడి నుండి మరో షాపుకు వెళ్లి ఎరువులు కావాలని అడిగారు సబ్ కలెక్టర్. అడిగిన ఎరువులు ఇచ్చి ఎమ్మార్పీ ధర కన్నా అధికంగా వసూలు చేశాడు సదరు షాపు యజమాని. అంతేకాదు వసూలు చేసిన సొమ్ముకు బిల్లు సైతం ఇవ్వలేదు యజమాని.


దీంతో సబ్ కలెక్టర్ సంబంధిత అధికారులు ఒకొక్కరికి ఫోన్ చేసి ఎరువుల షాపుకు పిలిపించారు. రెండు షాపులను సీజ్ చేయించారు. అక్కడి నుండి అధికారులతో కలిసి ముదినేపల్లిలో ఎరువుల షాపులకు వెళ్లి తనిఖీలు చేశారు. ముదినేపల్లిలో సబ్ కలెక్టర్ వెళ్లిన షాపు మూసి వేసి ఉండటంతో అక్కడి రైతులను సబ్ కలెక్టర్ వాకబు చేశారు. ఎమ్మార్పీ ధరల కన్నా అధికంగా అమ్ముతున్నారని రైతులు సబ్ కలెక్టర్ కు తెలిపారు. షాపు యజమానిని పిలిపించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సబ్ కలెక్టర్.


Next Story