వారి తరపున చర్చలకు రాలేదు.. ఐదు అంశాలపై మంత్రితో మాట్లాడాను : ఆర్జీవీ

RGV Meet With AP Minister Perni Nani. మంత్రి పేర్ని నానితో డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ సమావేశం ముగిసింది. సమావేశంలో సినిమా

By Medi Samrat  Published on  10 Jan 2022 4:53 PM IST
వారి తరపున చర్చలకు రాలేదు.. ఐదు అంశాలపై మంత్రితో మాట్లాడాను : ఆర్జీవీ

మంత్రి పేర్ని నానితో డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ సమావేశం ముగిసింది. సమావేశంలో సినిమా టికెట్ ధరలపై మంత్రితో చర్చించారు. టికెట్ల రేట్లు తగ్గించడంతో సినిమా పరిశ్రమ దెబ్బతింటుందన్న వర్మ.. త్వరలో మంచి నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఐదు అంశాలపై మంత్రితో మాట్లాడానని అన్నారు వర్మ. థియేటర్ల మూసివేతపై ఎలాంటి చర్చ జరగలేదని రామ్‌గోపాల్‌ వర్మ స్పష్టం చేశారు. టికెట్ల ధరల తగ్గింపుతో సినిమా క్వాలిటీ దెబ్బతింటుందని రామ్‌గోపాల్ వర్మ చెప్పారు. మత్రి పేర్ని నానితో జరిగిన చర్చలు సంతృప్తిగా ఉన్నాయన్నారు. టికెట్ల ధరల తగ్గింపుతో వచ్చే సమస్యలను కూడా ప్రభుత్వానికి వివరించానని రామ్‌గోపాల్ వర్మ చెప్పారు. ఫిల్మ్ మేకర్ గా తన అభిప్రాయాన్ని తాను చెప్పానన్నారు.

తాను ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల తరపున చర్చలకు రాలేదని వర్మ స్పష్టం చేశారు. సినిమా టికెట్ల ధరల తగ్గింపు అంశానికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నట్టుగా వర్మ అభిప్రాయపడ్డారు. సినిమా థియేటర్ల మూసివేత అంశం తనకు సంబంధించింది కాదని ఆయన చెప్పారు. తాను ప్రభుత్వానికి సినీ రంగంలోని సమస్యలపై సమగ్రంగా వివరించానని వర్మ అన్నారు. ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై తాను లోతుగా సమాచారం ఇచ్చానని చెప్పారు. మంత్రి పేర్నినానితో జరిగిన సమావేశం తనకు సంతృప్తిని ఇచ్చిందన్నారు.

అంతకు ముందు వర్మ హైదరాబాద్ నుంచి ఇండిగో విమానం లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. రోడ్డు మార్గంలో మినిస్టర్ పేర్ని నానిని కలిసేందుకు వెళ్లారు. భేటీకి ముందు ఆర్జీవీ మాట్లాడుతూ.. తాను ఇక్కడికి సినీ పరిశ్రమ ప్రతినిధిగా రాలేదని.. తన అభిప్రాయాలు చెప్పేందుకు వచ్చినట్టుగా తెలిపారు. ఇతరుల వ్యాఖ్యలపై తాను స్పందించనని అన్నారు. తాను చెప్పదలిచినది మాత్రమే భేటీలో ప్రస్తావించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం చెప్తున్నదానికి మేం మాట్లాడేదానికి చిన్న చిన్న మిస్ అడర్ స్టాండింగ్స్ ఉన్నాయి.. వాటిని కూర్చుని మాట్లాకోవడానికి మాత్రమే వచ్చాను తప్పితే అంతకు మంచి ఏమీ లేదు. ఇండస్ట్రీ పెద్దల గురించి నేను మాట్లాడనుకోవడం లేదు.. నేను వచ్చింది ఇండస్ట్రీ తరుపున కాదని, నా తరుపున వచ్చానన్నారు.


Next Story