రేపు ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు

Republic Day celebrations tomorrow at Indira Gandhi Municipal Stadium. జ‌న‌వ‌రి 26 గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు గురువారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో

By Medi Samrat  Published on  25 Jan 2023 12:05 PM GMT
రేపు ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు

జ‌న‌వ‌రి 26 గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు గురువారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జ‌రుగనున్నాయి. రేపు ఉదయం 8.50 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి స్టేడియంకు చేరుకుంటారు. అక్క‌డ రిపబ్లిక్‌ డే వేడుకలలో పాల్గొంటారు సీఎం జ‌గ‌న్‌. వేడుక‌ల అనంతరం తాడేపల్లి నివాసానికి తిరుగు పయనం అవుతారు. సాయంత్రం 4.30 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఆతిధ్యం ఇచ్చే హై టీ కార్యక్రమంలో జ‌గ‌న్‌ పాల్గొంటారు.

భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 26వ తేది గురువారం ఉ.8 గం.లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ భవనంపై శాసన మండలి అధ్యక్షుడు కె.మోషేన్ రాజు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేస్తారు.

అసెంబ్లీ :

గురువారం ఉద‌యం 8.15 గం.లకు రాష్ట్ర అసెంబ్లీ భవనంపై రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేస్తారు.

సచివాలయం :

సచివాలయం మొదటి బ్లాకు వద్ద గురువారం ఉద‌యం 7.30 గం.లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేస్తారు.

రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం :

నేలపాడులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వద్ద ఉ.10 గం.లకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగుర వేయనున్నారు. ఈ మేర‌కు సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

Next Story
Share it