విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రధాని మోదీ రోడ్ షో

విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో త్వరలో ప్రధాని మోదీ రోడ్ షో జరగనుంది. ఈ విషయాన్ని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ప్రకటించారు

By Medi Samrat
Published on : 25 April 2024 8:45 PM IST

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రధాని మోదీ రోడ్ షో

విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో త్వరలో ప్రధాని మోదీ రోడ్ షో జరగనుంది. ఈ విషయాన్ని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ప్రకటించారు. కేంద్ర మాజీ మంత్రి అరుణ్ సింగ్, సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పోతిన వెంకటేశ్వరరావు బీజేపీలో చేరారు. వెంకటేశ్వరరావు తో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు బీజేపీలో చేరారు.

ఈ సంద‌ర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ.. పశ్చిమ నియోజక వర్గం లో ప్రధాని మోదీ రోడ్ షో ఖరారైందని తెలిపారు. అరాచక పాలన పోయి మంచి పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, ప్రధాని వద్దకు నియోజక వర్గ సమస్యలు తీసుకు వెళ్లి పరిష్కారం చేస్తానని సుజనా తెలిపారు.

ఏపీలో చంద్రబాబు సీఎం కావడం ఖాయమని.. సుజనా చౌదరి భారీ మెజారిటీతో గెలుస్తారని ఇదంతా జరిగాక అందరినీ అయోధ్యకు తీసుకు వెళ్తానని అరుణ్ సింగ్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, సీనియర్ నేతలు ‍పైలా సోమినాాయుడు, భోగవల్లి శ్రీధర్, బాడిత శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story