ఇంద్రకీలాద్రి దసర ఉత్సవ షెడ్యూల్ రిలీజ్...
Indrakeeladri Dasara Celebrations Schedule. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసి ఉన్న కనకదుర్గ మహాలక్ష్మీ అమ్మవారి శరన్నవరాత్రుల
By అంజి Published on 31 Aug 2021 8:27 AM ISTఅక్టోబర్ 7 నుంచి శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవి శరన్నవరాత్రులు
తేదీ: 07 - 10 -2021 నుంచి తేదీ: 15 - 10 -2021 వరకు దసరా మహోత్సవాలు
గత సంవత్సరం కరోనా కారణంతో ఏకాంతంగా దసర ఉత్సవాలు
దసరా నుంచైనా పండగల్ని వైభవంగా నిర్వహించాలనుకుంటున్న ప్రభుత్వం
దేవస్థాన వెబ్‌సైట్ ద్వారా అర్జిత సేవా టికెట్లు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసి ఉన్న కనకదుర్గ మహాలక్ష్మీ అమ్మవారి శరన్నవరాత్రుల మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి తేదీ: 07 - 10 -2021 నుంచి తేదీ: 15 - 10 -2021 వరకు దసరా ఉత్సవాలు జరపనున్నట్లు దుర్గమల్లేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ప్రకటన రిలీజ్ చేశారు. గత ఏడాది కోవిడ్ కారణంగా అమ్మవారి శరన్నవరాత్రులు ఏకాంతంగా జరిగాయి. అయితే ఈ సారి అమ్మవారి శరన్నవరాత్రులను వైభవంగా నిర్వహించాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు.
అలాగే భక్తుల సౌకర్యార్థం దసరా ఉత్సవాలను లైవ్ టెస్ట్ చేస్తామని ఆలయ అధికారులు తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే అమ్మ వారి ఉత్సవాలను జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ప్రతి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ... రోజు 10 వేల మందిని మాత్రమే టైమ్ స్లాట్ ప్రకారం అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. రూ.300 టికెట్‌పై 3 వేల మందిని, రూ.100 టికెట్‌పై 3 వేల మందిని, అలాగే ఫ్రీ టోకెట్ల ద్వారా 4 వేల మందికి శ్రీకనకదుర్గ అమ్మవారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.