“తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం” పేరును మార్చలేదు

Did not change the name of Tummalapalli Vari Kshetraya Kalakshetram. విజయవాడ నగర పరిధిలోని సుప్రసిద్ద “తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం” పేరును

By Medi Samrat  Published on  14 Feb 2023 8:30 PM IST
“తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం” పేరును మార్చలేదు

విజయవాడ నగర పరిధిలోని సుప్రసిద్ద “తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం” పేరును ఏమాత్రం మార్చలేదని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టంచేశారు. నేడు పలు దినపత్రికల్లో ఆ కళాక్షేత్రం పేరును మార్చినట్లుగా వచ్చిన వార్తాంశాల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన తెలిపారు. 2016 లో జరిగిన కృష్ణా పుష్కరాల సందర్బంగా ఈ కళాక్షేత్రం ఎలివేషన్ ను పునరుద్దరించే సమయంలో “తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం” అనే పేరును తొలగించి మళ్లీ ఆ పేరును పునరుద్దరించబడలేదన్నారు. అయితే ఈ కళాక్షేత్రం కేవలం సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం మాత్రమే నిర్థేశించబడినది అనే ఉద్దేశ్యాన్ని ప్రస్పుటంగా తెలియజేయాలనే లక్ష్యంతో డిశంబరు 2021 లో “కళాక్షేత్రం” అనే పేరుతో ఎలివేషన్ భాగంపై గ్లో సైన్ బోర్డును ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. “తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం” అనే పేరుతో బోర్డును తయారు చేయడం జరుగుచున్నదని, అది పూర్తయిన వెంటనే భవనమునకు ఆ బోర్డును ఏర్పాటు చేయడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు.


Next Story