కావాలంటే చంద్రబాబు అరెస్ట్‌కు మద్దతు ఇస్తాం.. పాదయాత్రను అడ్డుకోవద్దు
CPI Narayana Fires On AP Govt. చంద్రబాబుపై కోపం ఉంటే ఆయనను అరెస్ట్ చేయండని.. అంతేకానీ, అమరావతి రైతుల
By Medi Samrat Published on
8 Nov 2021 2:06 PM GMT

చంద్రబాబుపై కోపం ఉంటే ఆయనను అరెస్ట్ చేయండని.. అంతేకానీ, అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవద్దని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌కు కావాలంటే తాము మద్దతు ఇస్తామని నారాయణ వ్యాఖ్యానించారు. పాదయాత్రలో సంఘవ్యతిరేక శక్తులెవరూ లేరని.. ఒకవేళ రౌడీషీటర్లు ఎవరైనా ఉన్నారంటే వైసీపీవాళ్లేనని అన్నారు. పాదయాత్రను అడ్డుకుంటే జైల్‍భరోకు పిలుపునిస్తామని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీచేశారు. అమిత్‍షా ఏ ముఖం పెట్టుకొని తిరుపతి వస్తున్నారని.. అమిత్ షాకు నల్ల జెండాలతో నిరసన తెలుపుతామని అన్నారు. అదానీ పోర్టు నుంచి మత్తుమందు రవాణా అవుతుందని.. అదానీకి చెడ్డ పేరు రాకుండా షారూఖ్ కొడుకును కిడ్నాప్ చేసి డ్రగ్స్ కేసు పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Next Story