ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణితో కలిసి గురువారం విజయవాడలోని ఇందకీలాద్రిపై వెలసిన కనకదుర్గ ఆలయాన్ని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
అమ్మవారి జన్మనక్షత్రం అయిన ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు పెట్టడం ఆనవాయితీ అని, తిరుపతి తరవాత రెండో అతిపెద్ద దేవాలయం దుర్గగుడి అని తెలిపారు. దేవాలయాల్లో పవిత్రతను కాపాడుకోవడం అందరి బాధ్యత అని అన్నారు. దసరాకు దేవాదాయశాఖ తరుపున ఏర్పాట్లు బాగా చేశారన్నారు. ఈసారి దసరాలో సామాన్య భక్తులకు పెద్దపీట వేశామని తెలిపారు.