బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు.. పవన్‌ కల్యాణ్‌కు సిగ్గులేదా: కొడాలి నాని

Andhrapradesh minister kodali nani hot comments. బద్వేలు బైపోల్‌లో బీజేపీ ప్రజలు గడ్డి పెట్టారని మంత్రి కొడాలి నాని అన్నారు. ఈ ఎన్నికలో వైసీపీకి 90 వేలకు పైగా మెజార్జీ

By అంజి  Published on  9 Nov 2021 12:47 PM IST
బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు.. పవన్‌ కల్యాణ్‌కు సిగ్గులేదా: కొడాలి నాని

బద్వేలు బైపోల్‌లో బీజేపీకి ప్రజలు గడ్డి పెట్టారని మంత్రి కొడాలి నాని అన్నారు. ఈ ఎన్నికలో వైసీపీకి 90 వేలకు పైగా మెజార్జీ వచ్చిందన్నారు. బీజేపీ నాయకులు ఒళ్ల దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని కొడాలి నాని వ్యాఖ్యానించారు. అమరావతిలో మీడియా సమావేశంలో కొడాలి మాట్లాడారు. జనసేన పనికిమాలిన పార్టీ అన్న ఆయన.. బీజేపీపై పెట్రోల్‌, టీడీపీపై డీజిల్‌ పోసి జనం తగులబెట్టారని విమర్శించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు పవన్‌ కల్యాణ్‌కు సిగ్గు లేదా? అంటూ కొడాలి ప్రశ్నించారు. వెస్ట్‌ బెంగాల్‌లో జరిగిన 4 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించారని.. ఆ పార్టీ చిత్తుగా ఓడిందన్నారు.. జగన్‌ మేక, నక్క కాదని.. ఆయన పులివెందుల పులి అని అన్నారు.

గల్లీలో ఉన్న బీజేపీ నాయకులు ఆయనను ఏమీ చేయలేరని, పార్టీలో ఉండి నాశనం అవుతున్నామని కేంద్రానికి చెప్పండని కొడాలి నాని పేర్కొన్నారు. ఇంధన ధరలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గిస్తే కేంద్రమే తగ్గించాలని.. తాము పన్నులు పెంచనప్పుడు ఎందుకు తగ్గిస్తామని కొడాలి ప్రశ్నించారు. రూ.60 ఉన్న పెట్రోల్‌ను 110 రూపాయాలకు చేసిన బీజేపీకే తగ్గించాల్సిన బాధ్యత ఉందన్నారు. మేం దోచుకుంటాం. మీరు తగ్గించుకోండి అంటే ఎలా అన్నారు. ఇంధన ధరలపై వ్యాట్‌ తగ్గిస్తే రాష్ట్రం కోల్పోయే ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా అంటూ ప్రశ్నించారు. ఇంధన ధరలపై వచ్చే డబ్బులను బీజేపీ పాలిత రాష్ట్రాలకు కేంద్రం పంచుతోందని ఆరోపణలు చేశారు. ఇదే విషయమై చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తే ఫలితం ఉంటుందని కొడాలి నాని పేర్కొన్నారు.

Next Story