మంగళగిరిలోని జనసేన సెంట్రల్ ఆఫీస్‌పై డ్రోన్ ఎగిరిన వ్యహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఇష్యూపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన పోలీసులు ఆ డ్రోన్ ప్రభుత్వానికి సంబంధించినదే అని తేల్చారు. ఏపీ ఫైబర్ నెట్ సంస్థకు చెందిన డ్రోన్‌గా గుర్తించారు పోలీసులు. సర్వేలో భాగంగానే కార్యాలయంపై డ్రోన్ ఎగిరినట్లు ఐడెంటిఫై చేశారు. ట్రాఫిక్, పారిశుద్ధ్య కాల్వల నిర్వహణ, రహదారుల స్థితిగతులపై ప్రభుత్వం అధ్యయనం చేపడుతోంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా మంగళగిరి నియోజకవర్గం అధ్యయనం చేస్తుండగా, పలు రకాల సర్వేలకు డ్రోన్లను వినియోగిస్తున్నారు.