ఏపీలో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు

220 New Corona Cases reported In AP. ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 25,532 పరీక్షలు

By Medi Samrat  Published on  1 Nov 2021 6:10 PM IST
ఏపీలో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు

ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 25,532 పరీక్షలు నిర్వహించగా.. 220 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు సోమ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,66,670కి చేరింది. నిన్న క‌రోనా వ‌ల్ల న‌లుగురు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,377కి చేరింది. 24 గంటల వ్యవధిలో 429 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,48,151కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,142 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,95,44,319 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.



Next Story