ఏపీ క‌రోనా బులిటెన్‌.. భారీగా త‌గ్గిన కేసులు

156 New Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 32,987

By Medi Samrat
Published on : 13 Nov 2021 11:43 AM

ఏపీ క‌రోనా బులిటెన్‌.. భారీగా త‌గ్గిన కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 32,987 పరీక్షలు నిర్వహించగా.. 156 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు శ‌నివారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,69,770కి చేరింది. నిన్న క‌రోనా వ‌ల్ల ఒక్క‌రు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,412కి చేరింది. 24 గంటల వ్యవధిలో 254 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,52,230 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,128 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,99,50,579 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.





Next Story