రౌడీ బాయ్ కొత్త సినిమా ఎనౌన్స్‌మెంట్.. మ‌రో హిట్టు ప‌క్కానా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Dec 2019 2:30 PM IST
రౌడీ బాయ్ కొత్త సినిమా ఎనౌన్స్‌మెంట్.. మ‌రో హిట్టు ప‌క్కానా..?

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో స్టార్ ఇమేజ్ ను మూట‌గ‌ట్టుకున్న యంగ్ సెన్సేష‌న్ విజయ్ దేవరకొండ.. ఆ త‌రువాత ఆ తర్వాత ‘మహానటి’, ‘గీతా గోవిందం’, ‘టాక్సీవాలా’ వంటి సక్సెస్‌ ఫుల్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ‘డియర్ కామ్రేడ్’, ‘నోటా’ సినిమాల‌తో ఈ యేడాది కొద్దిగా డీలా ప‌డ్డా.. అవేమి ఈ హీరో మార్కెట్, ఇమేజ్ మీద ప్ర‌భావం చూప‌లేదు.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా వ‌చ్చే సంవ‌త్స‌రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. అయితే.. మ‌రో సినిమాకు ఓకే చెప్పాడు ఈ రౌడీ. ఆ సినిమాను నిన్నుకోరీ, మ‌జిలీ చిత్రాల ఫేం శివ నిర్వాణ దర్శ‌క‌త్వంలో.. దిల్ రాజు పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు.

విజయ్ దేవరకొండకు హీరోగా ఇది 12వ చిత్రం. కాగా, శివ నిర్వాణ ప్ర‌స్తుతం నాని హీరోగా ‘టక్ జగదీష్’ అనే సినిమా చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ కూడ‌డా ‘వరల్డ్ ఫేమస్ లవర్’తో పాటు మ‌రో రెండు చిత్రాలు చేస్తున్నాడు. వీరిద్ద‌రి ప్ర‌స్తుత సినిమాలు పూర్తైన‌ తర్వాత ఈ చిత్రం సెట్స్ పైకి వెళుతుంద‌ని స‌మాచారం.

Next Story