సీక్రెట్‌గా లేడి కమెడియన్ ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్
By తోట వంశీ కుమార్ Published on 1 Sept 2020 11:17 AM ISTలేడి కమెడియన్ విద్యుల్లేఖ రామన్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. తెలుగు, తమిళ ప్రేక్షకులకు విద్యుల్లేఖ రామన్ సుపరిచితం. సరైనోడు, రాజుగారి గది, రన్ రాజా రన్ సినిమాలలో తన కామెడీతో ఎంతగానో ఆకట్టుకుంది ఈ లేడి కమెడియన్. ఇక ఆమె లుక్‌తోనే వెండితెరపై ఆడియన్స్‌ను నవ్వించే ప్రయత్నం చేస్తుంది. లాక్‌డౌన్ ముందు వరకు బొద్దుగా ఉండేది. అయితే.. లాక్‌డౌన్ కాలంలో ఆమె ఫిట్నెస్‌పై దృష్టి పెట్టింది. ఇటీవల స్లిమ్ లుక్ తో షాకిచ్చింది.
గతకొంతకాలంగా ఫిట్‌నెస్ నిపుణులు, న్యూట్రీషియన్ అయిన సంజయ్‌తో ఆమె ప్రేమలో ఉంది. ఇటీవల సైలెంట్ గా ఎంగేజ్మెంట్ ఈవెంట్ ని పూర్తి చేసుకుంది. ఆగస్టు 26న రోకా వేడక జరిగినట్లు విద్యుల్లేఖ సోషల్ మీడియాలో వెల్లడించింది. తనకు కాబోయే భర్త ఫోటోని అభిమానులతో పంచుకుంది. కరోనా నిబంధనలకు లోబడి నిశ్చితార్థం చేసుకున్నట్లు చెప్పింది. ఈ వేడుకకు కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైనట్లు తెలిపింది.
'మేం రోకా చేసుకున్నాం. ఆగస్టు 26న ఈ వేడుక జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే దీనికి హాజరయ్యారు. మేమందరం మాస్కులు ధరించాం. ఫోటోల కోసం మాత్రమే వాటిని తీసి, మళ్లీ వేసుకున్నాం. శుభాకాంక్షలు తెలిపిన వాళ్లందరికీ ధన్యవాదాలు' అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినీ సెలబ్రెటీలతో పాటు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. విద్యుల్లేఖ తండ్రి ప్రముఖ తమిళ టెలివిజన్ నటుడు మోహన్ రామన్ అన్న సంగతి తెలిసిందే.