Fact Check : శ్రీకాళహస్తిలో త్రాచుపామును పూజిస్తున్నారంటూ వీడియో వైరల్..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 July 2020 6:42 PM IST
Fact Check : శ్రీకాళహస్తిలో త్రాచుపామును పూజిస్తున్నారంటూ వీడియో వైరల్..?

శ్రీకాళహస్తి గుడిలో పెద్ద త్రాచుపామును పూజిస్తున్నారంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. 2:53 నిమిషాల వీడియోలో విగ్రహం ఉండగా, మరో వ్యక్తి త్రాచుపామును ఎత్తుకుని ఉన్నాడు. అక్కడే భక్తులు కూడా ఉన్నారు. పూజను పూర్తీ చేస్తూ చివరిలో హారతిని కూడా పట్టారు. ఆ పాము కూడా అక్కడే ఉంది.

ఆంధ్రప్రదేశ్ లో పామును పూజిస్తున్న వీడియో అంటూ ఇంకో యూట్యూబ్ ఛానల్ లో కూడా వీడియోను అప్లోడ్ చేశారు.

నిజ నిర్ధారణ:

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తిలో పాముకు పూజలు చేస్తూ ఉన్నారన్నది పచ్చి అబద్ధం.

ఈ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ వీడియో పలు యుట్యూబ్ ఛానల్స్ లో ఇంతకు ముందే అప్లోడ్ చేశారు. “Real Snake Harathi” అంటూ కొందరు వీడియోను అప్లోడ్ చేశారు.. కానీ ఎక్కడో చెప్పలేదు. ‘snake harathi was from a temple in Andhra Pradesh.’ అంటూ కూడా వీడియోను అప్లోడ్ చేశారు.

మారుతి శంకర్ అనే యూట్యూబ్ ఛానల్ లో “Real Snake Puja in Temple | Snake Worship” అంటూ జులై 2015న వీడియోను అప్లోడ్ చేశారు. ఆ వీడియో మలేషియాలోని మలెక్క గుడిలోనిది. ఆలయ పూజారి తింగేశ్వర్ శివాచారియార్ పూజను నిర్వహిస్తూ ఉన్నారు.

S1

Hindu Pad అనే యుట్యూబ్ ఛానల్ లో కూడా ఈ వీడియోను అప్లోడ్ చేశారు. “19 Feet King Cobra Snake Pooja at a Temple, Malaysia” అంటూ మలేషియాలోని గుడిలో 19 అడుగుల త్రాచుపాము పూజలందుకుంటోంది అని తెలిపారు. మలేషియా లోని శ్రీ ప్రతియంగార దేవి శక్తి పీఠంలో పెద్ద త్రాచుపాము పూజలు అందుకుంటోంది.

న్యూస్ మీటర్ శ్రీ ప్రతియంగార దేవి శక్తి పీఠం, మలేషియాకు సంబంధించిన సామాచారం గురించి వెతకగా అందుకు సంబంధించిన ఫేస్ బుక్ పేజీ లభించింది. ఆ పేజీలో పలు వీడియోలు, ఫోటోలను అప్లోడ్ చేశారు. వైరల్ వీడియోలో ఉన్న పూజారికి సంబంధించిన ఫోటోలు కూడా లభించాయి.

S2

ఆలయానికి సంబంధించిన వెబ్ సైట్ లింక్ కూడా ఉంది. http://www.pratiyangaraadevi.com/index.php. అందులో వైరల్ వీడియోలో ఉన్న పూజారికి సంబంధించిన ఫోటో కూడా లభించింది. ఆయన వేషధారణ వీడియోలో ఉన్న వేషధారణకు మ్యాచ్ కూడా అయింది.

S3

S4

శ్రీకాళహస్తి గుడిలో పెద్ద త్రాచుపామును పూజిస్తున్నారంటూ వైరల్ అవుతున్న వీడియో పచ్చి అబద్ధం. మలేషియా లోని శ్రీ ప్రతియంగార దేవి శక్తి పీఠంలో త్రాచు పాముకు పూజలు చేస్తూ ఉన్నారు.

Next Story