Fact Check : కరాచీలో కాదు.. కాశ్మీర్ లో కాదు.. పశ్చిమ బెంగాల్ లో ఇంత పెద్ద ఎత్తున రోడ్డు మీదకు వచ్చారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Aug 2020 7:04 PM IST
Fact Check : కరాచీలో కాదు.. కాశ్మీర్ లో కాదు.. పశ్చిమ బెంగాల్ లో ఇంత పెద్ద ఎత్తున రోడ్డు మీదకు వచ్చారా..?

Tarek Fatah అనే ట్విట్టర్ ఖాతాలో ప్రజలు రోడ్డు మీదకు వచ్చి 'ఇస్లాం జిందాబాద్' అంటూ అరుస్తున్న వీడియోను పోస్టు చేశారు. ఈ ఘటన చోటుచేసుకుంది ఏ కరాచీలోనో, కాశ్మీర్ లోనో కాదు.. పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో అంటూ ఆ పోస్టులో చెప్పుకొచ్చారు.

“This is not Karachi, Kashmir or Kerala. No this chant of ‘Islam Zindabad’ is being raised in Kolkata, the capital city of MamataBenerjee ruled West Bengal!.” మమతా బెనర్జీ పాలిస్తున్న పశ్చిమ బెంగాల్ లో ఈ ఘటన చోటు చేసుకుందని ట్వీట్ ద్వారా చెప్పుకొచ్చారు.



01

నిజ నిర్ధారణ:

కోల్ కతాలో చోటుచేసుకున్న ఘటన అంటూ వైరల్ అవుతున్న పోస్టులో 'నిజం లేదు'. 2017 లో బాంగ్లాదేశ్ లో చోటుచేసుకున్న ర్యాలీ అని తేలింది. మయన్మార్ నుండి వస్తున్న రోహింగ్యాల సమస్య గురించి ఈ ర్యాలీని నిర్వహించారు.

ఈ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని సెర్చ్ చేయగా ‘Spice Info Tube’ అనే యుట్యూబ్ ఛానల్ లో సెప్టెంబర్ 13, 2017న పూర్తీ వీడియోను అప్లోడ్ చేశారు. “IslamiAndolan Bangladesh enclose Myanmar Embassy.” అంటూ వీడియోను అప్లోడ్ చేశారు.

ఈ వీడియోలో ఎంతో క్లారిటీగా అక్కడ చోటు చేసుకున్న ర్యాలీని చూడొచ్చు. 'ఇస్లాం జిందాబాద్' అంటూ ఎక్కడ కూడా అరవలేదు. ఒరిజినల్ వీడియోను తీసుకుని దాన్ని ఎడిట్ చేశారు. అలాగే దానికొక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ను కలపడం జరిగింది.

ఒరిగినల్ వీడియోను చూడగా అది బంగ్లాదేశ్ కు చెందినదని స్పష్టమవుతుంది. 39 సెకండ్ల వద్ద బంగ్లాదేశ్ ఫోటో ఉండడం గమనించవచ్చు.

54 సెకెండ్ల వద్ద నిరసనకారులు ఓ ప్లకార్డును పట్టుకుని ఉండడాన్ని మనం గమనించవచ్చు. “STOP Brutal genocide on Rohingya Muslims” అంటూ రోహింగ్యాల మీద జరుగుతున్న అకృత్యాలకు నిరసన తెలియజేయగా.. అందులో “ISLAMI SHASANTANTRA CHATRA ANDOLAN” అని ఉంది బంగ్లాదేశ్ కు చెందిన 'ఇస్లామిఆందోళన్ బంగ్లాదేశ్' పార్టీకి చెందిన స్టూడెంట్ వింగ్ అని తెలుస్తోంది.

02

ISCA BD అనే యూట్యూబ్ ఛానల్ లో సెప్టెంబర్ 13, 2017న వీడియోను పోస్టు చేశారు.

ఇక ఘటనకు సంబంధించిన కీవర్డ్స్ ను పరిశీలించగా.. సెప్టెంబర్ 13, 2017న Dhaka Tribune కథనాన్ని ప్రచురించింది. మయన్మార్ ఎంబసీ దాకా ఆందోళనకారులు వెళ్ళాలి అనుకున్న ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మయన్మార్ లో రోహింగ్యాల మీద జరుగుతున్న దాడులను వీరు ఖండించారు. ఈ ఆందోళనలో వేల సంఖ్యలో ఆందోళనకారులు పాల్గొన్నారు.

Boomlive తో పాటూ ఇతర సంస్థలు ఈ పోస్టును అబద్ధం అంటూ తేల్చాయి.

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నట్లుగా ఈ ఘటన బెంగాల్ లో చోటుచేసుకోలేదు. ఆ వైరల్ పోస్టు 'పచ్చి అబద్ధం'. 2017 లో బంగ్లాదేశ్ లో చోటుచేసుకున్న ఘటన.

Next Story