హైదరాబాద్: కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా భారత్‌కు సాయం చేసింది. 2.9 మిలియన్‌ డాలర్ల నిధులను అందజేస్తామని శుక్రవారం తెలిపింది. మొత్తం 64 దేశాలకు 174 మిలియన్‌ డాలర్ల నిధులను కేటాయించింది. ఇందులో భారత్‌కు 2.9 మిలియన్‌ డాలర్లు కేటాయించారు. గత ఫిబ్రవరి నెలలో ప్రకటించిన 100 మిలియన్‌ డాలర్ల ప్యాకేజీకి ఇది అదనం కానుంది.

కరోనా వైరస్‌తో అత్యధిక ప్రభావితం అయిన 64 దేశాలకు అమెరికా ప్రభుత్వం సాయం ప్రకటించింది. భారత్‌కు ఇచ్చిన నిధులతో ల్యాబ్‌లు, కరోనా సోకిన వ్యక్తుల గుర్తింపు, బాధితులపై నిరంతర నిఘా, ఇతర సదుపాయాలను సమకూర్చుకోవాలని అమెరికా సూచించింది.

Also Read: ఓ మ‌హిళ చేసిన ప‌నికి.. రూ.26ల‌క్ష‌ల విలువ చేసే ఆహారాన్ని ప‌డేశారు

అమెరికా ప్రజలపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే ట్రంప్‌ ప్రభుత్వం అనేక ఉద్దీపన చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగానే అమెరికా.. కరోనా బాధిత దేశాలకు సాయం చేసింది.

Also Read: ఉద్యోగులకు మోదీస‌ర్కార్‌ బంఫ‌ర్ ఆఫ‌ర్‌.. జీతం రూ.5,500 పెంపు..

భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 873కి చేరింది. వీరిలో 79 మంది కోలుకున్నారు. 19 మంది మృతి చెందారని కేంద్రా ఆరోగ్య శాఖ తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికంగా 180, కేరళలో 173 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

అమెరికాలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 1,04,007కు చేరుకుంది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.