కృతి బర్త్‌డే.. మరో పోస్టర్‌ విడుదల చేసిన ఉప్పెన టీమ్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Sept 2020 11:45 AM IST
కృతి బర్త్‌డే.. మరో పోస్టర్‌ విడుదల చేసిన ఉప్పెన టీమ్‌

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'ఉప్పెన'. ఈ చిత్రం ద్వారా కృతీ శెట్టి హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు బావించగా.. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'ఉప్పెన' ను థియేటర్స్‌లోనే రిలీజ్‌ చేయాలని నిర్మాతలు బావిస్తున్నారు.

కాగా.. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని వీడియో సాంగ్స్ అలరించాయి. ముఖ్యంగా కృతీ శెట్టి క్యూట్ లుక్స్ కి మంచి మార్కులు పడ్డాయి. సినిమా రిలీజ్ కాకముందే ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. కాగా.. నేడు కృతీ శెట్టి బర్త్ డే సందర్భంగా 'ఉప్పెన' చిత్ర యూనిట్ తాజాగా మరో పోస్టర్ ని విడుదల చేసింది. ఈ పోస్టర్ లో కృతీ చేతికి గాజులు తొడుక్కుంటూ అందంగా కనిపిస్తోంది.

Next Story