అనురాగ్ కశ్యప్‌పై నటి పాయల్ ఘోష్ సంచ‌ల‌న‌ ఆరోపణలు.. స్పందించిన కంగ‌నా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Sep 2020 12:44 PM GMT
అనురాగ్ కశ్యప్‌పై నటి పాయల్ ఘోష్ సంచ‌ల‌న‌ ఆరోపణలు.. స్పందించిన కంగ‌నా

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్ కశ్యప్ తనను పలుమార్లు లైంగికంగా వేధించాడని నటి పాయల్ ఘోష్ ట్విట‌ర్ వేదిక‌గా ప్రధాని మోదీకి మొరపెట్టుకున్నారు. తనకు న్యాయం చేయాలని ట్వీట్‌లో కోరారు.పాయల్ ట్వీట్ లో.. అనురాగ్ న‌న్ను బ‌ల‌వంతంగా లొంగ‌దీసుకోవాల‌ని అనుకున్నాడు. నరేంద్ర మోదీజీ.. మీరు ఆయనపై చర్యలు తీసుకోవాలని.. ఓ సృజ‌నాత్మ‌క‌త గ‌ల‌ ద‌ర్శ‌కుడి నిజ స్వ‌రూపం గురించి దేశానికి తెలియజేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఈ విషయం బ‌య‌ట‌కు చెప్పడం వల్ల.. నా ప్రాణానికి ప్రమాదముండే ఆస్కారం ఉంది. దయచేసి సహాయం చెయ్యండని కోరింది.ఇదిలావుంటే.. పాయల్‌ ట్వీట్ పై నటి కంగనా రనౌత్ స్పందించారు. పాయ‌ల్ చెప్పిన‌ట్లుగా.. చాలా మంది పెద్ద హీరోలు నాతో కూడా ఇలా చేశారని.. డ్యాన్స్ ఫ్లోర్‌లో ప్రెండ్లీ డాన్స్‌ చేసేటప్పుడు.. వ్యాన్‌ లేదా రూమ్ డోర్ లాక్ చేసిన తర్వాత.. లేదా పార్టీలో హఠాత్తుగా జననాంగాలను తాక‌డం.. అలాగే ప‌ని కోసం అపాయింట్‌మెంట్ పేరుతో ఇంటికి ర‌మ్మ‌న‌డం లాంటివి చేస్తార‌ని కంగ‌నా ట్వీట్ చేశారు.

ఇక పాయల్‌, కంగ‌నా ట్వీట్ల‌పై అనురాగ్ కశ్యప్ ఘాటుగా స్పందించారు. ‘నా నోరు మూయించడానికి మరో మహిళను ఉసిగొలుపుతున్నారు’ అంటూ కంగనపై ఫైర్ అయ్యారు. నా నోరు మూయించడానికి ఓ మహిళ మరో మహిళతో అబద్ధం చెప్పించారని.. ఆమె(పాయ‌ల్‌) ఇతర మహిళలను కూడా వివాదాల్లోకి లాగారని.. మీ ఆరోపణలన్నీ అబద్ధాలు అంటూ కశ్యప్‌ ఘాటుగా ట్వీట్‌ చేశారు.అలాగే.. నాపై ఆరోపణలు చేసేటప్పుడు నాతో పని చేసిన‌ ఇందులోకి లాగడం సరి కాదని.. నాకు రెండు పెళ్లిలు అయినా.. అది మా ఇష్ట ప్రకారమే.. మా మధ్య ప్రేమతోనే జ‌రిగింద‌ని.. నాకు ఒక భార్య ఉందా..? ఇద్దరు భార్యలున్నారా ? గర్ల్స్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారా ? అన్న విషయాలు ప్రస్తుతానికి అప్రస్తుతమ‌ని క‌శ్య‌ప్ పేర్కొన్నారు.ఇక‌.. నేను చాలామంది మహిళలతో కలిసి పని చేస్తుంటానని.. వాళ్లతో కలిసి పదిమందిలో పని చేసినా.. ఒంటరిగా పని చేసినా నేనెప్పుడూ చెడుగా ప్రవర్తించలేదని.. ఎవరైనా చెడుగా ప్రవర్తించినా కూడా నేను సహించలేనని కశ్యప్ ట్వీట్ చేశారు. పాయ‌ల్ చెప్పిన‌దాంట్లో ఎంత నిజమో త్వరలోనే తేలుతుందని.. ఈ ఆరోపణల నుంచి నేను త్వ‌ర‌లోనే బయటకొస్తానని కశ్యప్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.

Next Story