సిట్టింగ్ ఎమ్మెల్యే ఆస్తులను అందరూ చూస్తుండగానే కూల్చి వేశారు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Aug 2020 6:58 PM IST
సిట్టింగ్ ఎమ్మెల్యే ఆస్తులను అందరూ చూస్తుండగానే కూల్చి వేశారు..!

లక్నో: ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూముల్లో భవంతులను నిర్మించిన వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా ఆ కట్టడాలను కూల్చి వేశారు. ఒకప్పుడు గ్యాంగ్ స్టర్ గా ఉండి ఆ తర్వాత ఎమ్మెల్యే అయిన ముఖ్తర్ అన్సారీ భవంతిని కూడా అధికారులు కూల్చివేశారు. లక్నో లోని పోష్ దిల్భాగ్ ప్రాంతంలో నిర్మించిన రెండు బిల్డింగ్ లను గురువారం ఉదయం కూల్చివేశారు. ఆ ప్రాంతంలో ప్రభుత్వ అధికారులు చేరుకోగా.. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.

ఉత్తరప్రదేశ్ పోలీసులు గ్యాంగ్స్టర్ అయిన ముఖ్తర్ అన్సారీకి చెందిన భవనాన్ని కూల్చివేశారు. క్రిమినల్స్ ఇకపై క్రైమ్ ను వదిలేయాలి.. లేదంటే ఇలాంటి కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మీడియా అడ్వైజర్ మృత్యుంజయ్ కుమార్ హెచ్చరించారు.

పాకిస్థాన్ నుండి భారత్ కు వచ్చిన ప్రజల కోసం కేటాయించిన 'నిష్క్రాంత్ సంపత్తి' అనే ప్రాంతంలో బిల్డింగ్ ను నిర్మించారు. ఈ భవంతిని కూల్చివేయడానికి అయ్యిన ఖర్చు రికవరీ చేస్తామని.. అలాగే కేసును కూడా పెట్టామని అధికారులు తెలిపారు. ఈ భవనాన్ని నిర్మించడానికి సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోనున్నారు. ముఖ్తర్ అన్సారీకి చెందిన పలు ఆస్తులను యూపీ అధికారులు ఇప్పటికే సీజ్ చేశారు. మవూ బీఎస్పీ ఎమ్మెల్యే అయిన ముఖ్తర్ అన్సారీకి, అతడి అనుచరులకు గన్స్ లైసెన్స్ లను రద్దు చేశారు.

Next Story