ఏ రాష్ట్రాలైనా, దేశాలైనా విద్యార్థుల బాగు కోసం కృషి చేస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు బడ్జెట్ లో లోటు ఉన్నా కూడా విద్యార్థులు భవిష్యత్తు కోసం పాటు పడుతూ ఉంటాయి కొన్ని ప్రభుత్వాలు.

తాజాగా ఉత్తరప్రదేశ్ లో విద్యార్థులకు ఇకపై స్కాలర్ షిప్ ఇవ్వలేమని ఆ రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిందంటూ పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. బడ్జెట్ చాలా తక్కువ ఉందని.. అందుకనే విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇవ్వలేకపోతున్నామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫోటో ను ఉంచి.. ABP news ఛానల్ కు సంబంధించిన గ్రాఫిక్స్ ప్లేట్ ను పెట్టి సామాజిక మాధ్యమాల్లో పోస్టులను వైరల్ చేస్తూ ఉన్నారు.

ఈ ఫోటోను కొందరు పోస్టు చేస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు ‘1000 కోట్ల రూపాయలు పెట్టి విగ్రహాన్ని  కట్టడానికి డబ్బు ఉంటుంది.. బడ్జెట్ మీద ఎటువంటి ప్రభావం ఉండదు.. అదే విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇవ్వాలంటే మాత్రం బడ్జెట్ లోటు’ అని చెబుతారంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు.

https://www.facebook.com/groups/1575563502507409/permalink/3405076502889424/

ఇదే ఫోటోను ట్విట్టర్ లో కూడా పోస్టు చేశారు. ‘అందుకే చదువుకున్న వాళ్ళను నేతగా ఎన్నుకోవాలని చెప్పేది.. చదువుకొని వ్యక్తిని నేతగా ఎన్నుకుంటే ఇలాంటివన్నీ అనుభవించాల్సి వస్తుంది’ అని ఇంకొకరు ట్వీట్ చేశారు.


నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న ఫోటోలు ‘పచ్చి అబద్ధం’.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు ఇకపై స్కాలర్ షిప్ ఇవ్వలేమంటూ చెప్పినట్లుగా మీడియా సంస్థలు ఎటువంటి కథనాలను కూడా వెల్లడించలేదు.

పదవ తరగతి, 12వ తరగతి, గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే కొత్త స్కాలర్ షిప్ స్కీమ్ లను తీసుకుని రాబోతున్నట్లు  India Today కూడా ఇటీవలే తెలిపింది.

Live Hindustan  కథనం ప్రకారం ప్రభుత్వం ఈ ఏడాది కూడా స్కాలర్ షిప్ లను అందించడానికి ముందుకు వచ్చింది. బడ్జెట్ లో రిలీజ్ కూడా చేసింది. అయితే ఫైనాన్స్ కమీషన్ అనుమతి ఇవ్వగానే స్కాలర్ షిప్ లు విడుదలవ్వనున్నాయి. విద్యార్థుల స్కాలర్ షిప్ లను  రద్దు చేయడం అన్నది జరగలేదని స్పష్టం చేశారు.

వైరల్ అవుతున్న ఫోటో ఎడిట్ చేసినదని స్పష్టమవుతోంది. ABP news గ్రాఫిక్స్ ప్లేట్స్ లో ఉపయోగించే అక్షరాల డిజైన్ కు.. వైరల్ పోస్టులో ఉన్న అక్షరాలకు చాలా తేడా ఉంది. ABP news బ్రేకింగ్ న్యూస్ గ్రాఫిక్ ప్లేట్ కు కూడా అక్కడ ఉన్న అక్షరాల ఫార్మాట్ తో అసలు సంబంధం లేకుండా ఉంది. దీన్ని బట్టే అది మార్ఫింగ్ చేసిన ఫోటో అని అర్థమవుతోంది.

A1

కాబట్టి యోగి సర్కారు మీద వైరల్ అవుతున్న ఈ పోస్టు ‘పచ్చి అబద్ధం’.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *