'అన్‌లాక్ 3.0' : సినిమా హాళ్లకు ఓకే.. మెట్రోకు నో..!
By తోట వంశీ కుమార్ Published on 27 July 2020 9:20 AM ISTUnlock 3.0 Cinema halls gyms likely to open కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు పలు విడతలుగా విధించిన లాక్ డౌన్ ను సడలించే క్రమంలో కేంద్రం అన్ లాక్ ప్రక్రియ అమలు చేస్తోంది. ఇప్పటివరకు రెండు పర్యాయాలు అన్ లాక్ పేరిట సడలింపులు ఇచ్చిన కేంద్రం మూడో విడత అన్ లాక్ పై సన్నాహాలు చేస్తోంది. జూలై 31తో అన్‌లాక్ 2.0 ముగియనుండగా.. ఆగస్టు ఒకటి నుంచి అన్‌లాక్ 3.0 ప్రారంభం కానుంది. దీంతో 3.0లో మరిన్ని ఆంక్షలకు సడలింపులు ఇచ్చేందుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించే పనిలో కేంద్ర హోం శాఖ నిగ్నమై ఉంది.
ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానున్న అన్‌లాక్ 3.0లో సినిమా హాళ్లకు అనుమతులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కఠినమైన సోషల్ డిస్టన్స్ నిబంధనలతో సినిమా హాళ్లను ఓపెన్ చేసుకునేందుకు థియేటర్ల యాజమాన్యాలతో మాట్లాడింది. సినిమా థియేటర్ల యాజమాన్యాలు మాత్రం 50 శాతం సీటింగ్ సామర్థ్యంతోనైనా సరే నడపడానికి సిద్ధంగా ఉండగా.. ప్రభుత్వం 25 శాతం సీటింగ్‌తో మొదలుపెట్టాలని సూచిస్తోంది. అంతేకాదు, ఒకవేళ సినిమా థియేటర్లు తెరవడానికి అనుమతిస్తే.. భౌతిక దూరం సహా అన్ని నిబంధనలూ పాటించాల్సిందే. అందుకు ఎంఏఐ(మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) సిద్ధంగా ఉందని సమాచారం. కాగిత రహిత టికెటింగ్ విధానం, హాల్‌లో సీట్లను దూరంగా జరపడం, శానిటైజింగ్ వంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు థియేటర్ల యజమానులు. థియేటర్లతో పాటు ఇలాగే పలు నిబంధనలతో జిమ్‌లకు కూడా అనుమతిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో నాలుగైదు రోజుల్లో నిర్ణయం తీసుకుని అన్‌లాక్ 3.0 ఆంక్షల సడలింపులో ఆ నిర్ణయాన్ని వెలువరించనున్నారని తెలుస్తోంది.
ఇక 3.0లో స్కూళ్లు, కాలేజీలు ఓపెన్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేసింది. మూడో దశలో అయిన మెట్రో రైళ్లను ప్రారంభిస్తారని అందరూ బావిస్తుండగా.. అందుకు కేంద్రం నో చెప్పింది. దీంతో మెట్రో సేవలు అందుబాటులోకి రావడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చు. మొదటి రెండు దశల్లో జనజీవనం సాధారణ స్థితికి రావడానికి అవసరమైన చాలావాటికి కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. జూలై 30న కేంద్రం అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది.
According to the new guidelines by @MoHFW_India, here are the instructions which Care-Givers should ensure on exposure to the Patient’s Environment. #IndiaFightsCorona pic.twitter.com/sKRlr4WTHO
— MyGovIndia (@mygovindia) July 27, 2020