కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ఇంట్లో విషాదం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Sep 2020 8:37 AM GMT
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ఇంట్లో విషాదం

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. మంత్రి హర్షవర్ధన్‌ మాతృమూర్తి (89)ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. తన తల్లి చనిపోయినట్లు తెలుపుతూ హర్షవర్ధన్ ట్విట్టర్‌లో భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశారు.

‘భూమిపై నా ప్రియమైన వ్యక్తి.. నా తల్లి, స్వర్గానికి వెళ్లినట్లు తెలిపేందుకు చింతిస్తున్న. 89 ఏండ్ల వయస్సులో ఈ ఉదయం ఆమె గుండెపోటుతో మృతి చెందింది. గొప్ప వ్యక్తి, తత్వవేత్త, నా మార్గదర్శకురాలు నన్ను వదిలి వెళ్లిపోయింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి’ అని ఆయన ట్వీట్‌ చేశారు. పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు హర్షవర్ధన్‌ను పరామర్శించారు.



Next Story