గోదావరిలో ఇద్దరు విద్యార్దులు గల్లంతు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Nov 2019 8:23 PM IST
గోదావరిలో ఇద్దరు విద్యార్దులు గల్లంతు..!

ముఖ్యాంశాలు

  • గోదావరిలో ఇద్దరు విద్యార్ధులు మునక
  • యానాం టూర్ కు వెళ్లిన విద్యార్ధులు
  • మునిగి పోయినవారు రాజమండ్రి విద్యార్దులుగా గుర్తింపు

యానాం: యానాం గౌతమి గోదావరిలో స్థానానికి దిగి రాజమండ్రి కి చెందిన ఇద్దరూ విద్యార్థులు గల్లంతు అయ్యారు. యానాం వచ్చిన పదిమంది విద్యార్దుల్లో ముగ్గురు గోదావరిలో స్థానానికి దిగారు. వీరిలో ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారు కోప్పల శేష సాయి పవన్(19), నేకురి చంద్రహాసన్ (20)గా గుర్తించారు. ఇద్దరిది రాజమండ్రి అని స్నేహితులు చెబుతున్నారు.

Next Story