మద్యం మత్తులో వృద్ధురాలైన బిచ్చగత్తెను వదలని కామాంధులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Dec 2019 3:28 AM GMT
మద్యం మత్తులో వృద్ధురాలైన బిచ్చగత్తెను వదలని కామాంధులు

హైదరాబాద్: మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. న్యూ మిర్జాలగూడాలో ఓ 60 సంవత్సరాల వృద్ధురాలిపై శనివారం ఇద్దరు దుండగులు అత్యచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. న్యూమిర్జాలగూడాలో ఓ వృద్ధురాలు పోట్ట కూటి కోసం బిక్షమెత్తుకుంటు జీవనం సాగిస్తోంది. ఎవరైనా చిల్లర మొత్తంలో సాయం చేస్తే.. అలా వచ్చిన డబ్బుతో జీవితాన్ని గడుపుతోంది. అటుగా వచ్చిన ఇద్దరు కామాంధులు దృష్టి వృద్ధురాలిపై పడింది. వృద్ధురాలికి మాయమాటలు ఇంటికి తీసుకెళ్లారు. అంతటితో ఆగకుండా బలవంతంగా మద్యం తాగించి, వారు కూడా తాగారు. ఆమె మత్తులోకి జారిపోగానే మానవమృగాలు అత్యచారానికి పాల్పడ్డాయి. కామాంధుల అఘాయిత్యాన్ని వెంటనే గమనించిన బాధితురాలు బిగ్గరగా కేకలు వేస్తూ అరిచింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు 100కి డయల్‌ సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులు చిన్నప్ప ఆంటోని, విజయ్‌లను అదుపులోకి తీసుకున్నారు.

Next Story
Share it