క్రెడిట్‌ కార్డు లేకున్నా రెండు లక్షల బిల్లు..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jun 2020 3:45 AM GMT
క్రెడిట్‌ కార్డు లేకున్నా రెండు లక్షల బిల్లు..

క్రెడిట్‌ కార్డు లేకున్నా.. ఓ వ్యక్తికి క్రెడిట్‌ కార్డు బిల్లు వచ్చింది. అది కూడా రూ.2.20లక్షల బిల్లు వచ్చింది. దీంతో ఆ వ్యక్తి షాక్‌ అయ్యాడు. ఎందుకంటే.. ఆ వ్యక్తికి ఇంత వరకు ఎలాంటి క్రెడిట్‌ కార్డు లేదు. కార్డు లేకున్నా సరే బిల్లు చెల్లించాలంటూ ఫోన్‌ కాల్‌ రావడం ప్రస్తుతం హాట్‌ టాఫిగా మారింది.

హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్‌లో చెన్నకేశవులు నివాసం ఉంటున్నాడు. ఇటీవల చెన్నెకేశవులకు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. బ్యాంకు అధికారిని మాట్లాడుతున్నాన్నంటూ చెప్పిన ఆ వ్యక్తి మీరు క్రెడిట్‌ ద్వారా కొనుగోలు చేసిన రూ.2.20లక్షలను వెంటనే చెల్లించాలన్నాడు. దీంతో చెన్నకేశవులు మైండ్‌ ఒక్కసారిగా బ్లాంక్‌ అయ్యింది. తేరుకుని తనకు అసలు క్రెడిట్‌ కార్డు లేదన్నాడు. అయినప్పటికి అవతలి వ్యక్తి అతడి మాటను వినలేదు సరికదా.. వెంటనే బకాయి చెల్లించాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు.

దీంతో బాధితుడు శనివారం సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. క్రెడిట్‌ కార్డు లేకున్నా.. బిల్లు కట్టాలని ఫోన్‌ చేసి బెదిరించాడని పోలీసుల వద్ద వాపోయాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story
Share it