హైదరాబాద్‌ నగరంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు బాలికలపై ఐదుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన నగరంలోని కమాటిపురా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారానికి పాల్పడిన వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నారని తెలిసింది.

Also Read: ఘరో రోడ్డు ప్రమాదం.. డ్రైవర్‌ సహా ఆరుగురు విద్యార్థులు మృతి

పోలీసుల కథనం మేరకు.. హుస్నేనిఆలం ప్రాంతంలో ఉండే ఇద్దరు అక్కా చెల్లెళ్లు స్థానికంగా ఉండే స్కూల్‌లో 9వ, 7వ తరగతులు చదువుతున్నారు. అదే స్కూల్‌లో చదువుతున్న 8వ తరగతికి చెందిన బాలుడు.. 9వ తరగతి చదువుతున్న బాలికతో ప్రేమ వ్యవహరం సాగించారు. ఈ క్రమంలోనే బాలికకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యచారం చేసే వాడు. ఇలా పలు సార్లు చేయడంతో పాటు తన ఇద్దరు స్నేహితులతో కూడా బాలికపై అత్యాచారానికి ఒడగట్టించాడు. ఇక నిందితుల ద్వారా సమాచారం తెలుసుకున్న మహ్మద్‌ షఫీక్‌, అతని స్నేహితుడు సైఫ్అలీ ఆ బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఇదే క్రమంలో బాలిక చెల్లిపై సైఫ్‌అలీతో పాటు మరో ఇద్దరు నిందితులు బెదిరించి పలు మార్లు అత్యాచారం చేశారు.

Also Read: హైదరాబాద్‌లో కొత్త రకం మోసం.. ఫోన్‌ ఎత్తారంటే మీ పని ఖతం..!

ఇద్దరు అక్కా చెల్లెళ్లకు తండ్రి లేడు. వారి బాగోగులను మేనమామ చూస్తున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా బాలికలు స్కూల్‌ అయిన పోయిన తర్వాత ఇంటికి ఆలస్యంగా రావాడాన్ని మేనమామ గమనించాడు. దీంతో సంవత్సర కాలంగా తమపై అత్యాచారం చేస్తున్నారని బాలికలు ఏడ్చుకుంటూ మేనమామకు చెప్పారు. వెంటనే మేనమామ ఇద్దరు బాలికలను తీసుకొని.. కమాటిపురా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను కొన్ని గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. నిందితుల్లో మహ్మద్‌ షఫీక్‌, మహ్మద్‌ సైఫ్‌అలీతో పాటు మరో ముగ్గురు మైనర్లు ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితులపై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.