ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్‌ సహా ఆరుగురు విద్యార్థులు మృతి

By అంజి  Published on  19 March 2020 4:05 AM GMT
ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్‌ సహా ఆరుగురు విద్యార్థులు మృతి

తమిళనాడులో ఘరో రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుప్పూర్‌ జిల్లాలోని అవినాషి సమీపంలోని పాలంకరై జాతీయ రహదారిపై లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ సహా ఆరుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సేలం నుంచి ఊటీకి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగిందని తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకున్న అవినాషి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఐరోపా సమాఖ్య అష్ట దిగ్భందనం -కరోనా ఎఫెక్ట్

ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందడంతో స్థానికంగా విషాధ ఛాయలు అలుముకున్నాయి. మృతులు సేలం ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజికి చెందిన విద్యార్థులుగా గుర్తించారు. మృతుల్లో కల్లకూరిచికి చెందిన రాజేష్‌ (21), సూర్యా (21), వెంకట్‌ (21), చిన్న శేలం చెర్తనాథన్‌(21), వసంత (21) గా గుర్తించారు. ఇక ధర్మపురికి చెందిన సంతోష్‌, సేలంకు చెందిన కార్తీ అనే ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులకు అవినాషి ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

Also Read: ఏయ్ కేఏ పాల్.. ఈ సుత్తిసలహాలు ఇచ్చేబదులు..

Next Story
Share it