కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తుంది. ముఖ్యంగా భారత దేశంలోనూ ఈ వైరస్‌ అంతకంతకు వ్యాప్తిచెందుతోంది. గత మూడునాలుగు రోజుల్లోనే సుమారు 100 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయంటే కరోనా వైరస్‌ ఏ విధంగా విజృంభిస్తుందో చెప్పవచ్చు. తాజాగా భారత్‌లో 175 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అటు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో సినీ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ట్విట్టర్‌లో హల్‌చల్‌ చేస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో తనదైన శైలిలో ట్వీట్లు చేస్తున్నారు. పలు రకాలుగా ప్రశ్నలతో అందరినీ ప్రశ్నిస్తున్నారు. తాజాగా రాంగోపాల్‌ వర్మ.. కే.ఏ.పాల్‌పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్‌ చేశారు. “ ఏయ్‌ కే.ఏ. పాలు ఈ సుత్తి సలహాలు ఇచ్చే బదులు నీ దేవునితో చెప్పి కరోనాని తీసేయమని చెప్పొచ్చు కదరా సుబ్బరావు.. నీకు నిజంగా దేవుడి దగ్గర అంత సీన్‌ ఉంటే నేను తిట్టిన తిట్లకు నాకు కరోనా వచ్చేటట్లు చేయి నీ యంకమ్మ” అంటూ పాల్‌పై రామ్‌ గోపాల్‌ వర్మ సటైర్లు వేశారు.రాంగోపాల్‌ వర్మ కొన్ని రోజులుగా కరోనాకు సంబంధించిన ట్వీట్లు చేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ తో అమెరికాలో మార్ట్స్ వద్ద సరుకుల కోసం అమెరికన్లు క్యూలైన్‌లకు సంబంధించిన వీడియోను పోస్టు చేశారు. ఈ క్యూలైన్లు బాహుబలి టికెట్ల క్యూలైన్ల కోసం వేచి ఉన్న రికార్డుల్ని బీట్‌ చేశాయని వర్మ ట్వీట్‌ చేశారు. మరో ట్వీట్‌లో భగవంతుడు, కరోనా వైరస్‌ మధ్య సీక్రెట్‌ సంబంధం కొనసాగుతుందని.. వాళ్ల లవ్‌ స్టోరీలో మనమే విలన్స్‌ అంటూ వర్మ మరో ట్వీట్‌ చేశారు. మరో పోస్టులో ఏ మతం కూడా మనల్ని కాపాడలేదంటూ పేర్కొన్నారు. మరోవైపు రాంగోల్‌ వర్మ ట్వీట్‌కు పలువురు నెటిజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మద్దతు తెలుపుతున్నారు. మరి వర్మ ట్వీట్‌కు కే.ఏ.పాల్‌ ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.

Newsmeter.Network

Next Story