బాలికలతో టీవీ యాంకర్‌ బాడీ మసాజ్‌.. కేసు నమోదు

By అంజి  Published on  29 Feb 2020 11:42 AM IST
బాలికలతో టీవీ యాంకర్‌ బాడీ మసాజ్‌.. కేసు నమోదు

ముఖ్యాంశాలు

  • బాలికలతో వెట్టిచాకిరి చేయించుకున్న టీవీ యాంకర్‌
  • కేసు నమోదు చేసిన నూజివీడు పోలీసులు
  • బాలికల విచారణలో పలు విషయాలు..

కృష్ణా: ఓ టీవీ యాంకర్‌పై శిశు సంక్షేమ కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చేసింది వేదవ పని.. యాంకర్‌ను అధికారులు వివరాలు అడిగితే పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. కృష్ణా జిల్లా నూజివీడులోని చైల్డ్‌ కేర్‌లో ఇద్దరు బాలికలు చదువుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ రోజు తల్లి.. ఆ ఇద్దరు బాలికలను పండుగ పేరుతో ఇంటికి తీసుకెళ్లింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ ఇద్దరు బాలికలను హైదరాబాద్‌ తీసుకొచ్చింది. నగరంలోనే ఓ టీవీ యాంకర్‌ ఇంట్లో కొంత మొత్తం డబ్బుకు బాలికలను పనికి కుదిర్చింది.

ఇదిలా ఉంటే.. సెలవులు ముగిసిన తర్వాత బాలికలు తిరిగి చైల్డ్‌కేర్‌కు చేరలేదు. దీంతో సీసీఐ అధికారులు పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు పెట్టారు. అనంతరం బాలికల కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. బాలికలు హైదరాబాద్‌లోని ఓ యాంకర్‌లో ఇంట్లో వెట్టిచాకిరి చేస్తున్నారని శిశు సంక్షేమ కమిటీ గుర్తించింది. ఇద్దరు బాలికలను అదుపులోకి తీసుకున్న కమిటీ సభ్యులు విచారించారు. ఇందులో కొన్ని చీదరించుకునే విషయాలు బయటపడ్డాయి. ఇంటి పనులతో పాటు బాడీ మసాజ్‌లు కూడా చేయించుకున్నారని బాలికలను శిశు సంక్షేమ కమిటీకి చెప్పారు. కాగా సీడబ్ల్యూసీ సభ్యులు నూజివీడు పోలీస్‌స్టేషన్‌లో యాంకర్‌పై ఫిర్యాదు చేశారు. ఆ యాంకర్‌పై మైనర్లని పనిలో పెట్టుకోవడం, వెట్టి చాకిరి చేయించుకోవడం చట్టరిత్యా నేరమని, వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు బాలికలను ఇంట్లో పనిలో పెట్టుకోవడం నేరమని తెలిసి ఎందుకు పనిలో పెట్టుకున్నావంటూ సీడబ్ల్యూసీ అధికారులు అడిగితే.. యాంకర్‌ పొంతలేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం.

Next Story