వైద్యుడిపై రేప్ కేస్ పెట్టిన మహిళ..ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డాక్టర్

By రాణి  Published on  28 Feb 2020 11:52 AM GMT
వైద్యుడిపై రేప్ కేస్ పెట్టిన మహిళ..ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డాక్టర్

వైద్యుడిపై రేప్ కేస్ పెట్టిందో మహిళ. పూణేకు చెందిన మహిళ..గతేడాది అక్టోబర్ లో ట్రీట్ మెంట్ కోసం ఆస్పత్రికి వెళ్లగా..అక్కడున్న వైద్యుడు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు తెలిపింది. ఆ తర్వాత చికిత్స కోసం అక్కడే ఉండటంతో.. డాక్టర్ కొడుకు కూడా తనపై అత్యాచారం చేసినట్లు పేర్కొంది. కాగా..ఇప్పుడు అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.

ఓ వ్యక్తి తనవద్దకొచ్చి కొడుకును రేప్ కేసు నుంచి బయటపడేస్తానంటూ సెటిల్ మెంట్ మాట్లాడాడని..అతడి మాటలు నమ్మి పెద్దమొత్తంలో నగదు ఇచ్చినట్లు చెప్పాడు. రూ.1.3 కోట్లు ఇస్తే గానీ..కేసు తప్పించుకోలేమని..లేకపోతే 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని భయపెట్టడంతో..బెదిరిపోయిన డాక్టర్ ముందు రూ.21 లక్షలు, తర్వాత రూ.54 లక్షలు ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు. ఇంకా రూ.55 లక్షలు కావాలని డిమాండ్ చేయడంతో..దిక్కుతోచని పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఈ విషయంపై విచారణ చేయగా..రేప్ కేసు పెట్టిన మహిళతో ఆస్పత్రి బిల్లు విషయంలో వివాదం జరగడం వల్ల ఆమె కేసు పెట్టినట్లు తేలింది. కాగా..మహిళ ఎస్సీ కావడంతో అడిగినంత డబ్బివ్వకపోతే ఎస్సీ, ఎస్టీ కేసు పెడతానని బెదిరించడంతో తనవద్ద ఉన్నదంతా సమర్పించినట్లు పోలీసులకు మొరపెట్టుకున్నాడు డాక్టర్.

డాక్టర్ చేసిన ఫిర్యాదు మేరకు సెటిల్ మెంట్ అంటూ డబ్బులు కాజేసిన నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టు ఎదుట హాజరు పరిచారు. విచారణ చేసిన న్యాయస్థానం నిందితుడిని రిమాండ్ కు తరలించాల్సిందిగా సూచించింది.

Next Story
Share it