కేంద్రం కీలక నిర్ణయం: బ్రహ్మపుత్ర నది కింద భారీ సొరంగం
By సుభాష్ Published on 15 July 2020 8:01 AM GMTకేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా సరిహద్దుకు సమీపంలో బ్రహ్మపుత్ర నది కింద వ్యూహాత్మకంగా కీలకమైన టన్నెల్ (సొరంగం) నిర్మాణానికి ఆమోదం తెలిపింది. నాలుగు లైన్లు ఉండే ఈ సొరంగం.. అసోంలోని గోహ్‌పూర్, నుమాలీగఢ్‌ను కలుపుతుంది. నది అడుగు భాగంలో ఈ టన్నెల్ నిర్మించడంతో భారత్‌లో తొలిసారి. ఈ సొంగాన్ని జియాన్షు ప్రావిన్స్ లో తైహు సరస్సు అడుగున నిర్మిస్తున్నారు.
దాదాపు 10.79 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు. ఈ సొరంగం పూర్తయితే అరుణాచరల్ ప్రదేశ్, అసోం మధ్య ఏడాది పొడవునా కనెక్టివిటీ ఉంటుంది. మిలటరీ సామాగ్రి, ఆయుధాలను వేగంగా తరలించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. దీనిద్వారా వాహనాలు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లే అవకాశం ఉంటుంది. 14.85 కిలోమీటర్ల పొడవుండే ఈ సొరంగ నిర్మాణాన్ని డిసెంబర్‌లో మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది.
అయితే నేషనల్ హైవేస్ అండ్‌ఇన్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, అమెరికా లూయిస్ బెర్గర్ కంపెనీ భాగస్వామ్యంలో రూపొందించిన ఈ ప్రాజెక్టు నివేదికకు కేంద్రం మార్చిలోనే ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ సొంగాన్ని మూడు దశల్లో నిర్మించనున్నట్లు తెలుస్తోంది.