ట్రంప్ అంతే..అదో టైప్....!!!
By న్యూస్‌మీటర్ తెలుగుPublished on : 18 Oct 2019 11:09 PM IST

వాషింగ్టన్: పేకాట పేకాటే బామర్ది బామర్ది అనేది తెలుగులో ఓ సామెత. భారత్‌పై ట్రంప్ తీరు అలాగే ఉంది ?హుస్టన్ సభలో భారత్‌ను తెగ పొగిడిన మోదీ..భారత్‌ను అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణించవద్దంటూ డబ్ల్యూటీవోకు లేఖ రాశారు. పక్కన చైనాను కూడా వదల్లేదు. డ్రాగన్ కంట్రినీ కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణించవద్దంటూ లేఖ రాశారు. ఈ రెండు దేశాలు అమెరికా మీద సుంకాలు విధిస్తూ ఎదుగుతున్నాయన్నారు. ఎవరేమనుకున్నా అమెరికా మాత్రం భారత్ ,చైనాలను అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పరిగణించదన్నారు. భారత్ - అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలో కుదుర్చుకుంటాయని అనుకుంటున్న సమయంలో ట్రంప్ ఇచ్చిన షాక్‌కు భారత్ అధికారులు బిత్తరపోయి ఉంటారు. ఇక..అమెరికా - చైనా మధ్య ట్రేడ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే.
Next Story