భారత్‌కు బయలుదేరిన 'ట్రంప్‌'

By సుభాష్  Published on  23 Feb 2020 4:16 PM GMT
భారత్‌కు బయలుదేరిన ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు భారత్‌ పర్యటనకు బయలుదేరారు. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు భారత్‌లో గడిపే ట్రంప్‌ సతీసమేతంగా ఎయిర్‌ఫోర్స్‌ 1 విమానంలో వాషింగ్టన్‌ నుంచి బయలుదేరారు. వారి వెంట ట్రంప్‌ కూతురు ఇవాంక, అల్లుడు జారెడ్‌ కుష్నల్‌ కూడా ఉన్నారు. ట్రంప్‌ జర్మనీ మీదుగా భారత్‌కు చేరుకుంటారు. సోమవారం ఉదయం 11.55 గంటలకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా స్వాగతం పలుకుతారు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొతేరా క్రికెట్‌ స్టేడియం వరకు ఇరు దేశాల అధినేతలు రోడ్‌షోలో పాల్గొంటారు. కాగా, 'నమస్తే ట్రంప్‌' అంటూ స్వాగతం పలికే ఏర్పాట్లు చేసింది భారత్‌.

Next Story