ట్రంప్‌ పసుపు రంగు టై ధరించడం వెనుక అసలు కథ ఇది

By సుభాష్  Published on  24 Feb 2020 12:36 PM GMT
ట్రంప్‌ పసుపు రంగు టై ధరించడం వెనుక అసలు కథ ఇది

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పర్యటన కొనసాగుతోంది. ఉదయం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ చేరుకున్న అనంతరం, మోరాటే స్టేడియంలో జరిగిన సభలో ట్రంప్‌, మోదీ ప్రసంగించారు. అనంతరం ఆగ్రాకు చేరుకుని తాజ్‌మహాల్‌ను తిలకించారు. కాగా, ట్రంప్‌ అమెరికా నుంచి బయలుదేరే సమయంలో ట్రంప్‌ రెడ్‌ కలర్‌ టై కట్టుకుని ఉన్నారు. వైట్‌ షర్ట్‌, రాయల్‌ బ్లూ కలర్‌ ప్యాంట్‌, బ్లూ కలర్‌ కోట్‌ ధరించి విమానం ఎక్కారు. అయితే భారత్‌కు వచ్చిన తర్వాత ఆయన బ్లాక్‌ సూట్‌ ధరించారు. అంతేకాదు.. రెడ్‌ టై బదులు పసుపు కలర్‌ టై ధరించారు.

మెలానియా కూడా డ్రెస్ మార్చుకున్నారు. బ్లాక్ డ్రెస్‌లో ఉన్న మెలానియా.. భారతదేశం గడ్డపై అడుగు పెట్టగానే వైట్‌ డ్రెస్‌లో కనిపించారు. కాగా, ట్రంప్‌ రెడ్‌ కలర్‌ టై బదులు.. పసుపు కలర్‌ టై కట్టుకోవడంలో పెద్ద కథే ఉందని చెప్పాలి. ఆ కలర్‌ టై కట్టుకోవడంలో గొప్ప సందేశం దాగి ఉందని చెబుతున్నారు. పసుపు కలర్‌ ఆనందానికి, వెచ్చదనానికి, ప్రకాశవంతానికి ప్రతీకగా అభివర్ణిస్తారు. హిందువుల్లో ఈ రంగుకు చాలా ప్రాముఖ్యతనిస్తారు. ఈ రంగు తెలివికి ప్రతీకగా అభివర్ణిస్తారు. స్నేహ బంధం నిలిచేందుకు సంకేతంగా ట్రంప్‌ ఈ పసుపు రంగు టై కట్టుకున్నారట. అంతేకాదు మెలానియా కూడా వైట్‌ కలర్‌ ధరించి వచ్చారు. తెలుపు రంగు శాంతికి ప్రతీకగా అభివర్ణిస్తారు. అందుకే ట్రంప్‌ దంపతులు భారత్‌కు రాగానే ఇలా డ్రెస్‌లు మార్చుకున్నారట.

Next Story