అలా జరిగితే మంత్రి పదవులు ఊడుతాయి.. కేసీఆర్ వార్నింగ్..!
By Newsmeter.Network Published on 4 Jan 2020 4:20 PM ISTహైదరాబాద్: తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ అధ్యక్షత వహించారు. సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీచైర్మన్, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యుహాన్ని సీఎం కేసీఆర్ వివరించారు. పార్టీ కర్తవ్యాలను, లక్ష్యాలను పార్టీ నాయకుల ముందుంచారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు క్యాడర్‌తో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ పేర్కన్నారు. 120 మున్సిపాటిలీలు, 10 కార్పొరేషన్‌లలో మళ్లీ టీఆర్‌ఎస్సే ఏకపక్షంగా గెలుస్తుందని కేసీఆర్ అన్నారు.
బీజేపీ మనకు పోటీ అనే అపోహాలు వద్దని.. మనకు ఎవరితో పోటీ లేదని సీఎం కేసీఆర్.. పార్టీ నేతలకు సూచించారు. పాత కొత్త నాయకులు సమన్వయంతో ఉండాలన్నారు. పార్టీ ఒకసారి అభ్యర్థిని ఫైనల్ చేశాకా.. ఆ అభ్యర్థి గెలుపు కోసమే పని చేయాలని సీఎం కేసీఆర్ చెప్పారు. అవసరం ఉన్న చోట మంత్రులు కూడా ప్రచారం చేస్తారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. నేతలంతా కలిసి పనిచేయాలని, ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్లాలన్నారు. శనివారం నాడు సుమారు రెండు గంటల పాటు సమావేశం జరిగింది. మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లో ఓడితే.. మంత్రుల పదవులు ఊడుతాయని సీఎం కేసీఆర్ సృష్టం చేసినట్లు సమాచారం.