ప్రపంచం అంతా కరోనా భయంతో తీవ్రమైన ఆందోళనలో గడుపుతుంటే కాశ్మీర్ లో ఊహించని పరిణామం జరిగింది. ఎన్ కౌంటర్ తో దక్షిణ కాశ్మీర్ ఒక్కసారి ఉలిక్కిపడింది .

దక్షిణ కశ్మీర్‌లోని కెరాన్ సెక్టార్‌లో ఐదుగురు ఉగ్రవాదులను భద్రత బలగాలు తుదముట్టించాయి. కుల్గామ్‌లో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం కాగా, ఆదివారం ఘటనలో ఓ జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. దక్షిణ కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో నలుగురు పౌరులు ప్రాణాల కోల్పోయిన తర్వాత భద్రత దళాలు తమ ఆపరేషన్ చేపట్టాయి. కుల్గామ్‌లో హిజ్బుల్ ముజాయిద్దీన్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆదివారం తెల్లవారుజామున కెరాన్ సెక్టార్‌లో మరికొందరు ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ముష్కరుల చర్యలను సమర్ధంగా తిప్పికొట్టింది.

Also Read: ఆర్మీ ఆపరేషన్‌.. 9 మంది ఉగ్రవాదులు హతం

ఉగ్ర దాడులకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉపద్రవం ముంచుకొస్తుందని ఇంటిలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపధ్యంలో అలెర్ట్ అయిన భారత సైన్యం ఉగ్రవాదులను మట్టు పెట్టింది. గత కొన్నేళ్లుగా దేశంలో అలజడి సృష్టించేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్నా వారి ప్రయత్నాలు ఫలించలేదు . ఎప్పటికప్పుడు మన సైన్యం వారి వ్యూహాలకు చెక్ పెట్టింది. ఇప్పుడు దేశం కరోనా కట్టడికి యుద్ధం చేస్తోంది. ఇక ఇదే అదునుగా ఉగ్ర దాడులకు స్కెచ్ వేస్తున్నారని తెలుసుకున్న ఐబీ భద్రతా దళాలను అప్రమత్తం చేయడంతో ఉగ్రవాదులను తుదముట్టించగలిగారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.