చిలుకూరు బాలాజీ దేవాలయంలో అద్భుతం జరిగిందని చెబుతున్నారు దేవాలయ అర్చకులు. ఇది కరోనా వైరస్‌ పై శుభవార్తకి సంకేతమని అంటున్నారు. ఆలయంలోని శివాలయంలో ఒక తాబేలు ఎక్కడి నుంచో ప్రవేశించింది. లోపలికి రావడానికి ఎలాంటి మార్గం లేకపోయినా ఆలయంలోకి ఇది ఎలా వచ్చిందనేది ఆలయ సిబ్బందికి ఆశ్చర్యం కలిగిస్తోంది.

హైద‌రాబాద్ న‌గ‌ర శివారులోని చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే తెలియ‌నివారుండ‌రు. ఇక్క‌డ స్వామివారికి ప్ర‌ద‌క్ష‌‌ణ‌లు చేయ‌డం ఆన‌వాయితీగా వ‌స్తుంది. మొక్కు మొక్కుకోవ‌డానికి 11 రౌండ్లు… మొక్కు చెల్లించుకోవ‌డానికి 21, 51, 108 ఇలా ప్ర‌ద‌క్ష‌ణ‌లు చేస్తుంటారు భ‌క్తులు. కాగా.. ఈరోజు తెల్లవారు జామున ఆలయంలోని శివాలయంలోకి ఓ తాబేలు వచ్చింది. దాదాపు పది సెంటీ మీటర్ల పొడవు, ఆరు సెంటీమీటర్ల వెడల్పున్న ఈ తాబేలు ఎలా ఆలయంలోకి వచ్చిందనే దానిపై స్పష్టత లేదని శివాలయం పూజారి సురేష్ ఆత్మారాం తెలిపారు. ఈ ఘటనపై చిలుకూరు బాలాజీ ఆయన ప్రధాన పూజారి రంగరాజన్ హర్షం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఇది చాలా శుభసూచకమని, తర్వలోనే కరోనా గురించి ప్రజలు శుభవార్త అందుకుంటారని చెప్పారు.

ఈ కూర్మ మూర్తి ప్రవేశం ఒక దివ్యమైన సంకేతాన్ని సూచిస్తుంది, కూర్మావతారం ఉద్దేశం క్షీరసాగర మథనం. పూర్వం అమృతం కోసం క్షీరసాగర మథనం జరిగినప్పుడు కూర్మరూపంలో వచ్చిన మహావిష్ణువుపైనే మేరు పర్వతాన్ని కవ్వంగా ఉంచి వాసుకి సాయంతో ఒకవైపు దేవతలు, ఒకవైపు అసురులు మదించారు. ఇప్పుడు కూడా కోవిడ్-19పై విజయం కోసం విశ్వమంతా ప్రయత్నం చేస్తుంది.

సాగర మథనంలో ఉద్భవించిన హాలాహలాన్ని పరమశివుడు మింగుతాడు.. ఇవాళ చిలుకూరులో సుందరేశ్వర స్వామి సన్నిధిలో కూర్మం ప్రత్యక్షమవడం అంటే త్వరలోనే లోకం నుంచి ఈ వైరస్ అంతమై అమృతం లభిస్తుందని సాక్షాత్తు ఆ వేంకటేశ్వర స్వామి సూచిస్తున్నట్లుగా ఉందని రంజరాజన్ చెప్పారు. భక్తులు చేసే ప్రార్థనలు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సేవలు, ప్రభుత్వం ప్రయత్నాలు అన్నిటికీ తొందరలో మంచి ఫలితం లభిస్తుందని రంగరాజన్ తెలిపారు. కాగా, ఆలయ వర్గాలు ఆ తాబేలు వీపుపై తిరునామాలు దిద్ది పూజలు నిర్వహించారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort