Fact Check : శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మద్యం లోడుతో వస్తున్న లారీ బోల్తా పడిందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 July 2020 1:55 PM GMT
Fact Check : శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మద్యం లోడుతో వస్తున్న లారీ బోల్తా పడిందా..?

మద్యం లోడుతో వస్తున్న ట్రక్కు నడి రోడ్డు పై బోల్తా పడడంతో దాన్ని చూసిన జనాలు ఆ మద్యం బాటిళ్లను తీసుకొని వెళ్లిపోయారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక్కో ప్రాంతంలో చోటుచేసుకున్న ఘటన అని పలువురు చెబుతూ ఉన్నారు. వీడియో ఎవరికి తోచినన్ని మద్యం బాటిళ్లను ప్రజలు తీసుకుని వెళ్లడం గమనించవచ్చు.

కొందరు సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో చోటుచేసుకుందని చెబుతున్నారు. అక్కడి నేషనల్ హైవేపై లారీ అదుపు తప్పి పడిపోవడంతో స్థానికులు పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లను తీసుకుని వెళ్లారని వీడియోను షేర్ చేస్తున్నారు.

మరికొందరేమో హోసూరు రోడ్డులో చోటుచేసుకుందని చెబుతూ ఉన్నారు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో డ్రైవర్ ప్రాణాలకు ఏమైందో కూడా చూడకుండా ప్రజలు మద్యం లూఠీ చేయడంలో బిజీ అయ్యారని చెబుతూ ట్వీట్లు కూడా చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు సిగ్గుచేటు అని పలువురు ట్వీట్లు చేశారు.

అక్కడ కాదు ఇక్కడ.. ఇక్కడ కాదు అక్కడ అంటూ పలువురు వీడియోను షేర్ చేశారు.

కొన్ని తెలుగు మీడియా సంస్థలు ఈ ఘటన చెన్నై తాంబరం హైవేలో చోటుచేసుకుందని కథనాలు వెల్లడించారు.

https://telugu.asianetnews.com/video/national/wine-truck-accident-in-chennai-tambaram-highway-people-are-looting-the-liquor-bottles-qdhybw

https://mictv.in/liquor-transport-lorry-overturned

ఈ వీడియోలో చాలా మంది మాస్కులు ధరించి ఉండడంతో ఈ ఘటన ఈ మధ్య చోటుచేసుకుందని తెలుస్తోంది. ఎక్కడ చోటుచేసుకుంది అన్నది మాత్రం మిస్టరీగా మిగిలింది.

నిజ నిర్ధారణ:

ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో చోటుచేసుకుందని వాట్సప్ లో వైరల్ అవుతున్న కథనాలు 'అబద్ధం'.

ఈ వీడియోను బాగా గమనిస్తే కొందరు పట్టుకున్న బ్యాగులపై తమిళ అక్షరాలు గమనించవచ్చు. తమిళంలో వారు మాట్లాడుతుండడం స్పష్టంగా వినిపిస్తుంది. వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకొని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము.. లారీ యాక్సిడెంట్ కు సంబంధించిన కీ వర్డ్స్ ను తీసుకుని వెతికినప్పటికీ సరైన రిజల్ట్స్ సమాచారం రాలేదు. గూగుల్ ట్రాన్స్ లేటర్ ను ఉపయోగించి తమిళంలో కీ వర్డ్స్ ను సెర్చ్ చేయగా తమిళనాడు లోకల్ మీడియాకు చెందిన చాలా రిజల్ట్స్ లభించాయి.

ట్రక్ అదుపుతప్పి పడిపోయిన ఘటన జులై 10, 2020న చోటుచేసుకుంది. స్థానికులు, రోడ్డు మీద వెళ్లే వాళ్లు క్యాబిన్ లో ఉన్న డ్రైవర్ ను కనీసం పట్టించుకోకుండా మద్యం బాటిళ్లను తీసుకుని వెళ్లే పనిలో పడ్డారు. కొన్ని గంటల పాటూ డ్రైవర్ ను ఎవరూ పట్టించుకోలేదు.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి అతడిని వేదసండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. దాదాపు 10 లక్షల విలువైన మద్యం బాటిళ్లు ఈ ప్రమాదంలో ధ్వంసం అయినట్లు తెలుస్తోంది.

ఈ ఘటన డూండిగళ్ కరూరు నేషనల్ హైవేలోని విఠల్ నాయకంపట్టి, వేదసండూర్ దగ్గర చోటుచేసుకుంది. Sathiyam News, Polymer News మీడియా సంస్థలు ఈ వీడియోను అప్లోడ్ చేశాయి.

Scroll.in కూడా ఈ వీడియోను పబ్లిష్ చేసింది. Watch: It was a free-for-all liquor fest when an alcohol truck overturned on the road అంటూ వీడియోను అప్లోడ్ చేసింది. తమిళనాడు లోని డూండిగళ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది అని అందులో తెలిపారు.

Dinamani.com, ns7.tv లకు సంబంధించిన రిపోర్టులు కూడా దొరికాయి.

https://tinyurl.com/yddfe58c

https://ns7.tv/index.php/ta/tamil-news/tamilnadu/10/7/2020/lorry-met-accident-which-took-load-tasmac-alcohols

శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో చోటుచేసుకుందని వాట్సప్ లో వైరల్ అవుతున్న కథనాల్లో ఎటువంటి నిజం లేదు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

Next Story