కరోనా బారిన పడి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలని కోరుతూ ఉన్నారు. అలా చేయడం ద్వారా కొందరి ప్రాణాలను బ్రతికించవచ్చు. ఇప్పటికే ప్లాస్మా థెరపీ ద్వారా తీవ్రమైన అనారోగ్యం బారిన పడిన వారిని వైద్యులు రక్షించారు. అందుకే కరోనాను జయించిన వారు ప్లాస్మాను దానం చేయాలని వైద్యులు కోరుతూ ఉన్నారు. ఎంతో మంది ముందుకు వస్తున్నారు.

ప్రస్తుతం వాట్సప్ లో ఓ పోస్టు వైరల్ అవుతోంది. ఫోన్ నంబర్లు, వారిది ఏ బ్లడ్ గ్రూప్ అన్నది చెబుతూ 25 మంది వ్యక్తుల సమాచారం వైరల్ అవుతోంది. వారు కోవిద్ నుండి బయటపడ్డారని.. ప్లాస్మా దానం చేయడానికి సముఖంగా ఉన్నారని.. కావాల్సిన వారు సంప్రదించాలని ఆ మెసేజీలో చెబుతూ వస్తున్నారు.

Ps

నిజ నిర్ధారణ:

వాట్సప్ లో వైరల్ అవుతున్న పోస్టు ‘అబద్ధం’

కొన్ని కీవర్డ్స్ ను ఉపయోగించి న్యూస్ మీటర్ సెర్చ్ చేయగా medium.com అనే వెబ్ సైట్ లింక్ దొరికింది. అందులో ‘List of Blood Donors in Chennai’ అన్నది కనిపించింది. చెన్నై లో ఉన్న బ్లడ్ డోనర్ల లిస్టు అది. నవంబర్ 2017న ఆ లిస్టును పబ్లిష్ చేశారు.

Hyderabad blood donors అనే ఫేస్ బుక్ పేజీలో కూడా కొన్ని ఫోన్ నంబర్స్ ను షేర్ చేశారు. ఫిబ్రవరి 2017న 62 ఫోన్ నంబర్లను పోస్టు చేశారు. అందులో ప్లాస్మా డోనర్లు అన్నది ఎక్కడా చెప్పలేదు.

మరికొంత అదనపు సమాచారం కలిపి https://chityala4u.blogspot.com/ లో జూన్  2017న ఇంకొక లిస్టును యాడ్ చేశారు.

న్యూస్ మీటర్ సదరు కాంటాక్ట్ లను సంప్రదించాలని ప్రయత్నించగా చాలా నంబర్లు మనుగడలో లేవు. ట్రూకాలర్ లో చాలా నంబర్ల లొకేషన్ తమిళనాడు అని చూపించింది. Altnews.in జూన్ 2020లో ఈ నెంబర్లపై ఫ్యాక్ట్ చెక్ చేయగా.. నాలుగు సంవత్సరాల కిందట బ్లడ్ డోనార్ల గురించి తయారుచేసిన లిస్ట్ అని తేల్చారు.

కోవిద్-19 బారిన పడి కోలుకున్న వారి ప్లాస్మాను మాత్రమే కరోనా వైరస్ ట్రీట్మెంట్ కోసం ఉపయోగిస్తారని చాలా రిపోర్టులు తెలిపాయి. సాధారణ వ్యక్తులకు సంబంధించిన ప్లాస్మాను తీసుకోరు. ఎందుకంటే కోవిద్-19 యాంటీబాడీస్ (ప్రతిరోధకాలు) అందులో ఉండవు.

ప్లాస్మా డోనర్లు అంటూ వాట్సప్ లో వైరల్ అవుతున్న నంబర్లు ప్లాస్మా డోనర్లకు సంబంధించినది కాదు. కొన్నేళ్ల కిందటి రక్త దాతల లిస్టు అది. ఇప్పటి పరిస్థితులకు ఎటువంటి సంబంధం లేదు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *