పిల్లలతో సహా ఆత్మహత్యకు సిద్ధపడ్డ మహిళ.. అంతలోనే..
Timely response by locals save three lives in Khammam. స్థానికులు సకాలంలో స్పందించి ఓ వివాహిత, ఆమె పిల్లల ప్రాణాలను కాపాడారు,
By Medi Samrat Published on
25 Sep 2022 3:00 PM GMT

సకాలంలో స్పందించి ఓ వివాహిత, ఆమె పిల్లల ప్రాణాలను కాపాడారు అక్కడి స్థానికులు. వివరాళ్లోకెళితే.. ఆదివారం ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్‌లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. నేలకొండపల్లి మండలం చెర్వు మాధారం గ్రామానికి చెందిన షేక్ నూర్జహాన్ బేగం అనే మహిళ కుటుంబ సమస్యల కారణంగా తమ ఇద్దరు పిల్లలతో కలిసి రిజర్వాయర్ వద్దకు వచ్చిందని తెలిపారు. వారు రిజర్వాయర్‌లోకి దూకేందుకు యత్నించడాన్ని గమనించిన స్థానిక యువకులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని అడ్డుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని మహిళకు కౌన్సెలింగ్ చేశారు. ఆమె బంధువులను పిలిపించి మహిళను, పిల్లలను వారికి అప్పగించారు.
Next Story