తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల విద్యార్థులకు రానున్న 2 వారాల్లో వరుస సెలవులు ఉండనున్నాయి. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో రేపు పాఠశాలలకు సెలవు ఉండగా, తెలంగాణలో ఆప్షనల్ హాలిడే. అయితే తర్వాత రోజు ఆగస్ట్ 9న రాఖీ పౌర్ణమితో పాటుగా రెండో శనివారం వచ్చింది. అలాగే ఆగస్ట్ 10వ తేదీ ఆదివారం వచ్చింది.. ఇలా మూడు రోజులు వరుసగా సెలవులు ఉన్నాయి.
మరోవైపు ఆ తర్వాత వారమే వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి.. ఆగస్టు 15వ తేదీ (శుక్రవారం) స్వాతంత్ర దినోత్సవం కాగా.. (హాఫ్ డే స్కూలు). ఆగస్టు 16వ తేదీ శ్రీకృష్ణాష్టమి (శనివారం) సెలవు వచ్చింది. ఆగస్టు 17వ తేదీ (ఆదివారం) మరో సెలవు వచ్చింది. ఈ వారం మాత్రమే కాదు వచ్చే వారంలో కూడా శుక్ర, శని, ఆదివారాలు వరుసగా సెలవులు ఉన్నాయి. ఈ నెలలో మొత్తం 10 రోజులు సెలవులు వచ్చాయి.