గల్ఫ్ బాధితులకు ఊరట..ఏప్రిల్ 13 నుండి హైదరాబాద్, విజయవాడలకు స్పెషల్ ఫ్లైట్స్

గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా అక్కడ చిక్కుకుపోయిన తెలుగు వలస కార్మికులు ఏప్రిల్ 13 నుండి స్వస్థలాలకు తిరిగి రానున్నారు.

By -  Knakam Karthik
Published on : 10 April 2026 9:39 PM IST

Telugu News, GulfMigrants, Telangana, AndhraPradesh, SpecialFlights, GulfCrisis

గల్ఫ్ బాధితులకు ఊరట..ఏప్రిల్ 13 నుండి హైదరాబాద్, విజయవాడలకు స్పెషల్ ఫ్లైట్స్

గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా అక్కడ చిక్కుకుపోయిన తెలుగు వలస కార్మికులు ఏప్రిల్ 13 నుండి స్వస్థలాలకు తిరిగి రానున్నారు. విమాన ఛార్జీల పెరుగుదల, ప్రయాణ ఆటంకాల వల్ల ఇప్పటివరకు ఇబ్బందులు ఎదురవ్వగా, ఏప్రిల్ 13 నుండి 29 వరకు హైదరాబాద్ మరియు విజయవాడలకు ప్రత్యేక విమానాలు నడపాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో జజీరా ఎయిర్‌లైన్స్ ప్రత్యేక విమానాలను సిద్ధం చేసింది. తమ వారు సురక్షితంగా తిరిగి వస్తుండటంతో గల్ఫ్ బాధితుల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రయాణ ఏర్పాట్లపై ట్రావెల్ ఏజెంట్లు నిమగ్నమవ్వగా, బాధితుల బంధువులు విమాన సర్వీసుల వివరాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమ వారిని రక్షించాలని ఇప్పటికే పలు కుటుంబాలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరిన విషయం తెలిసిందే.

Next Story