రేపు స్కూళ్లకు హాలిడే..?

జనవరి 1 నూతన సంవత్సరం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్ హాలిడే ప్రకటించలేదు

By -  Knakam Karthik
Published on : 31 Dec 2025 8:44 AM IST

Telugu News, Telangana, Andrapradesh, New Year, Public Holiday

రేపు స్కూళ్లకు హాలిడే..?

జనవరి 1 నూతన సంవత్సరం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్ హాలిడే ప్రకటించలేదు. అయితే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఆప్షనల్ హాలిడే మాత్రమే ఉంది. అయినా చాలా వరకు ప్రైవేట్ స్కూళ్లు రేపు సెలవు ప్రకటించాయి. సాధారణంగా అన్నీ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ఉంటుంది. ఈ క్రమంలోనే పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దీనికి బదులు ఫిబ్రవరిలో రెండో శనివారం పాఠశాలలు పని చేస్తాయని యాజమాన్యాలు చెబుతున్నాయి.

2026 సంవత్సరానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం సెలవుల క్యాలెండర్‌ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. వాటితోపాటు ఆప్షనల్‌ హలీడే (ఐచ్చిక సెలవులు) జాబిత కూడా విడుదల చేసింది. న్యూ ఇయర్ అనేది సెలవుల జాబితాలో లేదు. ఆప్షనల్‌ హలీడేలో జనవరి 1వ తేదీ సెలవుగా తీసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. దీంతో 2026 సంవత్సరం జనవరి 1వ తేదీన ఆప్షనల్‌ హలీడేగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

బ్యాంకులు పని చేస్తాయా?

కొత్త సంవత్సరం 2026కు స్వాగతం పలుకుతున్న వేళ, జనవరి 1 తేదీ నాడు బ్యాంకులు పని చేస్తాయా లేదా అని చాలా మంది కస్టమర్లు సందిగ్ధంలో ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక హాలిడే క్యాలెండర్ ప్రకారం దీనిపై స్పష్టత వచ్చేసింది. బ్యాంకులకు సెలవు లేదని, యధావిధిగా కార్యకలాపాలు కొనసాగుతాయని ఆర్బీఐ తెలిపింది.

Next Story