Interview: తెలంగాణలో 14 లోక్ సభ స్థానాలను టార్గెట్ చేస్తున్నాం... మా పోరాటం బీజేపీతోనే: కాంగ్రెస్ నేత మన్సూర్ అలీ ఖాన్

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ నేరుగా భారతీయ జనతా పార్టీతో పోరాడుతుందని.. భారత రాష్ట్ర సమితి లోక్ సభ ఎన్నికల్లో పోటీలోనే లేదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Jan 2024 4:45 PM IST
Telangana, BJP, Congress, Mansoor Ali Khan

తెలంగాణలో 14 లోక్ సభ స్థానాలను టార్గెట్ చేస్తున్నాం... మా పోరాటం బీజేపీతోనే: కాంగ్రెస్ నేత మన్సూర్ అలీ ఖాన్ 

2024 లోక్‌సభ ఎన్నికలకు కేవలం కొన్ని నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ నేరుగా భారతీయ జనతా పార్టీతో పోరాడుతుందని.. భారత రాష్ట్ర సమితి లోక్ సభ ఎన్నికల్లో పోటీలోనే లేదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

న్యూస్‌మీటర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తెలంగాణ ఇన్‌ఛార్జ్, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మన్సూర్ అలీ ఖాన్ పార్లమెంటరీ రాబోయే లోక్ సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ వ్యూహంపై చర్చించారు.

విద్యావేత్త , మృదు స్వభావి అయిన మన్సూర్ అలీ ఖాన్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భారీగా పార్లమెంట్ సీట్లు దక్కేలా చేయాలని భావిస్తూ ఉన్నారు. వివిధ ప్రభుత్వ పదవుల కోసం పోటీ పడుతున్న వారిని కలుపుకుని పోవడమే కాకుండా.. గ్రేటర్ హైదరాబాద్, హైదరాబాద్‌లోని ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసేలా చేయాలని ప్రణాళికలను రచిస్తూ ఉన్నారు.

న్యూస్ మీటర్(NM) : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి మీరు ఏం పాఠాలు నేర్చుకున్నారు? మీరు కొత్తగా ప్రారంభించబోతున్నారా? లోక్‌సభ 2024 అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో దేనిని వర్తింపజేస్తారు?

మన్సూర్ అలీ ఖాన్ (MK): 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాత్రమే పోరు ఉంటుంది. బీఆర్‌ఎస్ ఇప్పుడు ‘ఫెయిర్ వెదర్ పార్టీ’, ఆ పార్టీ అంతిమంగా బీజేపీకి మద్దతు ఇవ్వబోతోంది. కాబట్టి బీఆర్‌ఎస్‌కు ఓటు వేసిన వారు ఇప్పుడు బీజేపీలోకి మారనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్, హైదరాబాద్ (ఓల్డ్ సిటీ), ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. మేము దానిపై పని చేస్తున్నాము. ప్రజాపాలన (టీఎస్ ప్రభుత్వ కార్యక్రమం) దరఖాస్తులను పరిశీలిస్తే అత్యధికంగా నగరానికి చెందినవే. నగరంలో త్రిముఖ పోరులో కాంగ్రెస్‌ ఓటమి పాలైంది. కానీ లోక్‌సభలో అలా ఉండదు. ఉత్తర తెలంగాణ.. మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఉంది. ఆ ప్రాంతంపై కూడా దృష్టి పెడుతున్నాం.

NM: లోక్‌సభ ఎన్నికల్లో టిక్కెట్ల కోసం అసెంబ్లీ ఎన్నికల సమయంలో సర్వేలను ఉపయోగించినట్లుగానే పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా మీరు ఉపయోగిస్తారా?

MK: అభ్యర్థి అతని/ఆమె గెలుపు సామర్ధ్యం గురించి మేము అంచనా వేస్తాం. ఎన్నికల్లో గెలవడం అత్యంత ముఖ్యమైన అంశం. కాబట్టి అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే సర్వేలు, అభ్యర్థుల అంచనాల విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. దాని ఆధారంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది.

NM: సుదీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేసిన వారికి టిక్కెట్లు నిరాకరించడంపై అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇది కొంతమంది పార్టీని విడిచిపెట్టడానికి దారితీసింది. మరికొందరు వేరే పార్టీ తరపున పోటీ చేయవలసి వచ్చింది. మీరు అలాంటి పరిస్థితులలో ఎలా వ్యవహరించబోతున్నారు?

MK: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 14 స్థానాలను గెలవాలని ప్రయత్నిస్తున్నాం. అందుకోసం గెలుపు గుర్రాలు కావాలి. దక్షిణ భారతదేశంలోని ఎన్నికలు వివిధ అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అభ్యర్థి బలంగా ఉండాలి. ప్రజలకు చేరువయ్యేందుకు అవసరమైన విధంగా ప్రచారం చేయగలగాలి. అభ్యర్థి గెలుస్తారని సర్వే చెబితేనే టిక్కెట్టు. ఇందుకు సంబంధించి ఒక పద్ధతి ఉంది.. అది అనుసరిస్తారు. ప్రస్తుతం మా దృష్టంతా సీట్లు సాధించడంపైనే ఉంది.

NM: యువతకు, మహిళలకు సరైన అవకాశం ఇవ్వబోతున్నారా?

MK: యువత, మహిళలు పోటీ చేయాలని మేము కోరుకుంటున్నాము. అందుకు తగ్గట్టుగా అభ్యర్థుల కోసం చూస్తున్నాము.

NM: మరి హైదరాబాద్ పార్లమెంట్ సీటు సంగతేంటి?

MK: హైదరాబాద్‌లో మాఫియా, బోగస్ ఓటింగ్‌ కు వ్యతిరేకంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. అందుకు కృషి చేయాలని పార్టీ కార్యకర్తలను, అసెంబ్లీ ప్రతినిధులను కోరాం. నాంపల్లిలో బోగస్ ఓటింగ్‌ను అరికట్టవచ్చని ఫిరోజ్ ఖాన్ కృషి చేసి చూపించారు. ఇతరులు ఆయన లాగే పని చేయాలని మేము కోరుకుంటున్నాము.

NM: హైదరాబాద్ సీటు కోసం మజ్లిస్ బచావో తహ్రీక్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందా?

MK: ఆ విషయంపై ఆలోచించాలి. అసెంబ్లీ ఎన్నికలలో పలు సమస్యలు కనిపించాయి. ఆ సమస్యలపై మా దృష్టి పెట్టాం. హైదరాబాదు సీటు విషయంలో భిన్నంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

NM: తెలంగాణలో ముస్లిం ప్రాతినిథ్యం ఎక్కువగా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం నాయకుడికి ఎలాంటి పదవి ఇవ్వలేదు. దీన్ని ఎలా డీల్ చేస్తారు? లోక్‌సభ ఎన్నికలలో తగిన ముస్లిం ప్రాతినిధ్యం ఉంటుందా?

MK: అసెంబ్లీ ఎన్నికల సమయంలో హైదరాబాద్‌లో ఏం జరిగింది? ముస్లింలు ఏకమై కాంగ్రెస్ పార్టీకి ఓటేశారా? వారు అలా చేసి ఉంటే, మేము నగరంలో నాలుగు సీట్లు సులభంగా గెలిచి ఉండేవారు. ఇప్పుడు హైదరాబాద్‌ నుంచి గాంధీభవన్‌కు వచ్చి కాంగ్రెస్‌ పార్టీకి ఓటేశామని చెబుతున్న వారందరినీ ఎలా నమ్మాలి? ఎన్నికల ఫలితాల్లో వచ్చిన సంఖ్యలు మాకు వేరే కథను చెబుతాయి. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ముస్లింలు కాంగ్రెస్‌కు ఓటేస్తారని మాకు నమ్మకం ఉంది. ముస్లింలు లేదా మరే ఇతర మైనారిటీల సమస్యలపై కేంద్రంలో పోరాడే పార్టీ కాంగ్రెస్ తప్ప మరొకటి లేదు.

NM: రాష్ట్రంలోనూ, దేశంలోనూ మొదటి, రెండో వరుసలో ముస్లిం నేతలు ఉండేలా కాంగ్రెస్ కూడా కసరత్తు చేస్తోందా?

MK: మేము బలమైన నాయకుల కోసం వెతుకుతూనే ఉన్నాం. కానీ అనుకున్న ఫలితాలను దక్కించుకోలేకపోతున్నాం. ముస్లింలలోనూ మంచి నాయకులు కావాలి.

NM: లోక్‌సభ ఎన్నికల్లో రామమందిరం అంశాన్ని జనం ఎలా స్వీకరించనున్నారు? దీన్ని కాంగ్రెస్ ఎలా ఎదుర్కోబోతోంది?

MK: పార్టీ వైఖరి ఇప్పటికే బహిరంగంగానే చెప్పాం. మేము మతాన్ని రాజకీయాలతో కలపలేదు.. కలపబోము. మేము ఈ దేశ ప్రజల సమస్యలను పరిష్కరించాలనుకుంటున్నాము.

Next Story